ఐపీఎల్ 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ప్లే ఆఫ్స్‌లో మూడు స్థానాల గురించి క్లారిటీ రాగా.. మరో స్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ […]
రెండేళ్లకు పైగా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం నాడు సచివాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు జీడీఏలో రిపోర్టు చేశారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను సీఎస్ సమీర్ శర్మను కలవలేదని చెప్పారు. తన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకే తాను సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించానని.. అయితే తనను కలిసేందుకు […]
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, అగ్రికల్చర్‌పై రివ్యూ మీటింగ్ నిర్వహించగా ఈ సమావేశానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇదే మొదటి సమావేశమని తెలిపారు. ఈ మీటింగ్‌లో వచ్చిన సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాను ముందుండి నడిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పాత కృష్ణా జిల్లాకు మంచి పేరు ఉందని.. ఇప్పుడు అదే రీతిలో ఎన్టీఆర్ జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని […]
కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మండిపడ్డారు. తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను కన్నెర్ర చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. జగన్ పాలనలో ప్రజలకు వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు తప్పడం లేదని ఎద్దేవా చేశారు. Somu […]
ఏపీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర లేదని.. కొనుగోళ్లలో ఘరానా మోసం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అధికారులతో కుదిరిన ఒప్పందాన్ని మాత్రం దర్జాగా అమలు చేస్తూ మిల్లర్లు రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనేక వేదికల మీద ఈ విషయం చెబుతోన్నా ప్రభుత్వం మొద్దు […]
బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ రెచ్చిపోయాడు. కేకేఆర్ బౌలింగ్‌ను చీల్చి చెండాడి భారీ సెంచరీ చేశాడు. బౌండరీల ద్వారానే డికాక్ 100 పరుగులు పిండుకున్నాడు. మొత్తం 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో డికాక్ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఐపీఎల్‌లో వ్యక్తిగత స్కోరు విషయంలో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో డికాక్ మూడో […]
ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని.. రైతు భరోసా కేంద్రాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులు కాని వారిని రైతులుగా చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలతో విషప్రచారం చేస్తున్నాయని.. ఇలాంటి వార్తలపై తాము కోర్టును ఆశ్రయిస్తామని […]
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం వైఖరిపై మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ మౌనం రైతులకు శాపంగా మారిందని.. ఇప్పటికైనా సీఎం జగన్ నోరు విప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. జోకర్ లాంటి జలవనరుల మంత్రి అంబటి రాంబాబుతో పిచ్చి మాటలు మాట్లాడిస్తే సరిపోదన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమాని తిడితే పోలవరం పూర్తికాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎం జగన్ మూర్ఖత్వం, డబ్బు వ్యామోహం, తెలివి తక్కువతనం, అవగాహనారాహిత్యమే […]
సత్యసాయి జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. నీటి కేటాయింపు విషయంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతం అయ్యాయి. గత ఏడాది ఏ విధంగా నీటి కేటాయింపులు జరిగాయో ఈ ఏడాది కూడా అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలని పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. అయితే తన నియోజకవర్గానికి ఆయకట్టు ప్రాతిపదికన కేటాయింపు జరగాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు. […]
ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లపాటు వికెట్ పడకుండా ఆడి 210 పరుగులు చేశారు. ఓపెనర్లు డికాక్(70 బంతుల్లో 140 నాటౌట్), కేఎల్ రాహుల్(51 బంతుల్లో 68 నాటౌట్) వీర విహారం చేశారు. అంతేకాకుండా వీళ్లిద్దరూ ఐపీఎల్‌లోనే రికార్డు స్థాయిలో ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బెయిర్‌స్టో, వార్నర్ (185 పరుగులు) పేరిట ఉన్న ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ […]