MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్‌లో 50+ సిక్సర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా.. ఎంఐ న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విద్వంసకర మ్యాచ్‌గా నిలిచింది. అమెరికాలోని ఓక్లాండ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారిగా ఒకే టీ20 మ్యాచ్‌లో 50కి పైగా (మొత్తం 51) సిక్సర్లు నమోదయ్యాయి. ఎంఐ న్యూయార్క్ 29 సిక్సర్లు, వాషింగ్టన్ ఫ్రీడమ్ 22 సిక్సర్లు బాదాయి. దీనితో ఐపీఎల్ 2024 (KKR vs PBKS)లో నమోదైన 42 సిక్సర్ల రికార్డు బద్దలైంది.
ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో 29 సిక్సర్లు బాదిన ‘ఎంఐ న్యూయార్క్’, 2025 లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ (28 సిక్సులు) నెలకొల్పిన రికార్డును అధిగమించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. నికోలస్ పూరన్ (MI NY).. 33 బంతుల్లో 106 పరుగులు (13 సిక్సర్లు), ఆండ్రీస్ గౌస్ 51 బంతుల్లో 132 పరుగులు (12 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ 48 బంతుల్లో 110 పరుగులు (9 సిక్సర్లు) సెంచరీలు నమోదు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ 9 వికెట్లకు 266 పరుగులు చేయగా, వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసి రికార్డు విజయాన్ని అందుకుంది.
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఐపీఎల్ 2026 లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన 265 పరుగుల రన్ చేజ్ రికార్డును వాషింగ్టన్ ఫ్రీడమ్ బద్దలు కొట్టింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆటగాళ్లు ఆండ్రీస్ గౌస్, స్టీవ్ స్మిత్ మూడో వికెట్‌కు 241 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టీ20 చరిత్రలో ఏ వికెట్‌కైనా సంయుక్తంగా రెండో అత్యధిక భాగస్వామ్యం. వీరు ఐపీఎల్ 2016 లో గుజరాత్ లయన్స్‌పై విరాట్ కోహ్లీ – ఏబీ డివిలియర్స్ (229 పరుగులు) నెలకొల్పిన రికార్డును దాటేశారు.
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!