ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యల పేర్లను మంగళవారం నాడు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అయితే సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు వస్తుందని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం జగన్ కూడా అలీని పిలిపించుకుని మాట్లాడారంటూ వార్తలు వినిపించాయి. అలీ కూడా కొన్నిసార్లు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ఒక ప్రకటన వస్తుందని కూడా చెప్పాడు.
Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోనసీమ జిల్లా పేరు మార్పు
కట్ చేస్తే ఇప్పుడు అలీకి రాజ్యసభ సీటు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నటుడు అలీ స్పందించాడు. వైసీపీ నుంచి తాను రాజ్యసభ సీటు ఆశించలేదని సినీ నటుడు అలీ స్పష్టం చేశాడు. సీఎం జగన్ దృష్టిలో తాను ఉన్నానని.. భవిష్యత్‌లో పార్టీ తరపున ఎలాంటి పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వహిస్తానని ఆలీ చెప్పాడు. తనకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదన్నాడు. అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం జగన్ చెప్పారని… తనకు కూడా ఆ నమ్మకం ఉందని అలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా రాజ్యసభ సభ్యత్వం దక్కక పోవడంతో అలీ వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.