ఏపీలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ క్రాప్ నమోదు పేరుతో జగన్ సర్కారు రైతులను దారుణంగా దోచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇది రైతులను దోచుకుంటున్న ప్రభుత్వం అని.. అన్నదాతల ఆగ్రహానికి సీఎం జగన్ బలికాక తప్పదని ఆలపాటి రాజా హెచ్చరించారు. భూమి, పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయకుండా ధాన్యం కొనుగోళ్లలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 శాతం భూమికి […]
అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లిపాలు చాలా అవసరం. ఎందుకంటే తల్లిపాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందుకే పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడానికే అందరూ ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొందరు తల్లులుకు పాలు రాకపోతే పిల్లలకు సమస్య ఏర్పడుతుంది. భారత్‌లోని మహిళలకు తల్లి పాలు రాకపోవడం అన్న సమస్య అరుదుగానే ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం తల్లులకు సరిగ్గా పాలు రావు. అక్కడి మహిళలు ఆధునిక జీవనశైలిని కలిగి ఉండటం వల్ల తల్లుల్లో పాల కొరత ఏర్పడుతోంది. […]
కాకినాడ జీజీహెచ్ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం కేసు మరింత జఠిలంగా మారింది. సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే పోస్టుమార్టం జరిగితే తప్ప ఈ కేసు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. తొలుత భార్య అంగీకారంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినా అనంతరం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సుబ్రమణ్యం భార్య కూడా […]
విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మరో అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తడి చెత్త, పొడి చెత్తల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను కాపులుప్పాడ డంపింగ్ యార్డులో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ అధికారికంగా ప్రారంభం కాకపోయినా ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన మాత్రం కొనసాగుతోంది. ప్రతిరోజూ ఈ ప్రాజెక్టు నుంచి 15 మెగావాట్ల విద్యుత్ […]
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది. ఈరోజు రాత్రికి జరిగే మ్యాచ్ నాలుగో బెర్తును ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కథ ముగుస్తుంది. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు […]
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. కీలక స్పిల్ వే నిర్మాణం పూర్తయినట్లు ఈ ప్రాజెక్టు పనులను చేపట్టిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు, అదేవిధంగా 98 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు సైతం పూర్తయ్యాయి. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్ల ఏర్పాటు పనులు,10 రివర్ స్లూయిజ్ గేట్ల ఏర్పాటుతో పాటు […]
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో జోష్ తేవాలని చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మహానాడులో ముఖ్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏయే అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో […]
టీమిండియాకు చెందిన మరో ఆటగాడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జూన్ 1న ఆగ్రాలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది దుబాయ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దీపక్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్‌కు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అప్పటి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రత్యేకంగా […]
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా కొత్త నంబర్ నుంచి మనకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడానికి చాలా సందేహిస్తాం. వాళ్లు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇకపై అలాంటి ప్రయాసలు పడాల్సిన అవసరం లేదు. కొత్త నంబర్ నుంచి కాల్ వస్తే వారి పేరు కూడా మొబైల్ స్క్రీన్ మీద వచ్చేలా ట్రాయ్ ప్లాన్ చేస్తోంది. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌కు కేంద్ర టెలికాం విభాగం సూచించింది. Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని […]
ఐపీఎల్ తర్వాత టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లకు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. రోజురోజుకు గాయాల బారిన పడిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆల్‌రౌండర్లు దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలతో పాటు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా గాయాల కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ కూడా ఈ జాబితాలో చేరాడు. CSK: ఒక్కడు దూరమైతే.. ఇంత […]