Kakinada: జఠిలంగా మారిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జీజీహెచ్ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం కేసు మరింత జఠిలంగా మారింది. సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే పోస్టుమార్టం జరిగితే తప్ప ఈ కేసు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. తొలుత భార్య అంగీకారంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినా అనంతరం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సుబ్రమణ్యం భార్య కూడా సంతకం పెట్టేందుకు నిరాకరించి తలను గోడకేసి కొట్టుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు పోస్టుమార్టం కోసం సుబ్రమణ్యం కుటుంబసభ్యులతో పోలీసులు బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
Kakinada Tension: కాకినాడలో టెన్షన్ టెన్షన్
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
కాగా సుబ్రమణ్యం మృతి కేసులో కుటుంబ సభ్యులు, బంధువులు శవ పంచనామాకు సహకరించి వాంగ్మూలాలు ఇస్తే ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేలా చూస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. ఈ కేసును ప్రభుత్వం, పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుందని.. ఈ కేసులో పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం, డీజీపీ నుంచి ఆదేశాలు అందాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అందువల్ల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ విషయాన్ని గమనించి ఈ కేసు తదుపరి దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!