సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా కొత్త నంబర్ నుంచి మనకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడానికి చాలా సందేహిస్తాం. వాళ్లు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇకపై అలాంటి ప్రయాసలు పడాల్సిన అవసరం లేదు. కొత్త నంబర్ నుంచి కాల్ వస్తే వారి పేరు కూడా మొబైల్ స్క్రీన్ మీద వచ్చేలా ట్రాయ్ ప్లాన్ చేస్తోంది. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌కు కేంద్ర టెలికాం విభాగం సూచించింది.
Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!
ఇప్పటివరకు మన మొబైల్‌లో ఇతరుల నంబర్‌ను వాళ్ల పేరుతో సేవ్ చేసుకుంటే మాత్రమే సదరు వ్యక్తులు కాల్ చేసినప్పుడు మొబైల్ స్క్రీన్ మీద కనిపించేవి. ఇప్పుడు కేంద్ర టెలికాం విభాగం నిర్ణయించిన కొత్త విధానం అమలైతే కాల్ చేస్తున్న వారిని గుర్తించడంతో పాటు కచ్చితత్వం, పారదర్శకత వస్తుందని ట్రాయ్ ఆలోచిస్తోంది. దీనికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు టెలికాం విభాగంతో ట్రాయ్ సమాలోచనలు జరుపుతోంది. ఫోన్ కనెక్షన్ తీసుకునే సమయంలో టెలికాం కంపెనీలకు కస్టమర్ అందించే కేవైసీ ఆధారంగా కాల్ చేస్తున్న వారి పేరు ఫోన్ స్క్రీన్ మీద చూడొచ్చు.