ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండటాన్ని మంత్రి జోగి రమేష్ ఖండించారు. టీడీపీ విధానాలు చూసి రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి పనికిమాలిన వాళ్లను 14 ఏళ్లు ఎలా భరించామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారని జోగి రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళ్లటం నేరమా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ దావోస్‌కు వెళ్లడం టీడీపీ […]
ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన వివాదాస్పదంగా మారింది. సీబీఐ కోర్టుకు జగన్ ముందుగా చెప్పినట్లు నేరుగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వెళ్లకుండా లండన్‌లో ల్యాండ్ కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ అంశాన్ని టీడీపీ వదిలిపెట్టడం లేదు. దండుకున్న అవినీతి సంపదను దాచుకోవడానికే జగన్ లండన్ వెళ్లారని శనివారం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ నేత పట్టాభి కూడా జగన్ లండన్ టూర్‌పై విమర్శల వర్షం […]
ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసిపోతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైపోయాయి. పాయింట్ల టేబుల్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా నాలుగు స్థానాలను ఆక్రమించాయి. ప్లే ఆఫ్స్‌లో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఈ నెల 24న గుజరాత్, రాజస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో […]
కరోనా సమయంలో నటుడు సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో పేదలకు సహాయం అందించి రియల్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ వ్యక్తి తాజాగా రూ.68 వేలు దోచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీకి చెందిన పి.సంధ్య(36) అనే మహిళ బంధువుల్లో ఒకరికి కేన్సర్ చికిత్స కోసం డబ్బు అవసరమైంది. దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో […]
ఏపీ సీఎం జగన్ శనివారం రాత్రి దావోస్ చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. రేపు డబ్ల్యూఈఎఫ్‌తో జగన్ కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సదస్సు తొలిరోజు పలువురితో జగన్ సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో ఏపీ రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడనుంది. నూతన […]
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో గుడ్ న్యూస్ అందించింది. ప్లాస్టిక్, సిమెంట్, ముడి పదార్థాలపై సుంకం తగ్గించనున్నట్లు ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సిమెంట్ లభ్యత మెరుగు పడటంతో పాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంతేకాకుండా స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో సిమెంట్, స్టీల్ కొరత తగ్గి ధరలు […]
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5), ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ (0) త్వరత్వరగా ఔట్ కావడంతో 22 పరుగులకే రెండు వికెట్లు […]
కర్నూలు జిల్లా పర్యటనలో ఓర్వకల్లులోని రాక్ గార్డెన్‌ను మంత్రి రోజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం, పిక్నిక్ స్థలాలు, వసతి కోసం హరిత రిసార్టు పర్యాటకులకు అందిస్తున్నామన్నారు. ఇది పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. మరోవైపు ప్రతిపక్షం టీడీపీపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పచ్చకామెర్లు ఉన్నాయని.. అందుకే ఆయనకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందని రోజా సెటైర్ వేశారు. […]
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై ప్రధాని మోదీ స్పందించారు. పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ పౌరులకు మరింత ఉపశమనం కలగడంతో పాటు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజలే మొదటి ప్రధాన్యత అని మోదీ వెల్లడించారు. దేశంలో ఉజ్వల యోజన పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లాభపడుతున్నాయని […]
కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోలుపై రూ.9.50, లీటర్ డీజిల్‌పై రూ.7 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49గా ఉండగా.. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.120, లీటర్ డీజిల్ రూ.105.65గా ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.110కి దిగివచ్చే అవకాశముంది. అటు లీటర్ డీజిల్ ధర రూ.100 […]