ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జగన్ దావోస్ వెళ్లారని ప్రభుత్వం నిన్న ప్రకటించింది. అయితే సీఎం జగన్ దావోస్ వెళ్లలేదని నేరుగా లండన్ వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపీకి, ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందని.. కనీస విలువలను పాటించాలన్న స్పృహ […]
ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగించుకుని మంగళగిరి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం సెల్ ఫోన్ వెలుగులోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానన్నారు. రాజధాని విషయంలో బీజేపీ […]
కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ సుబ్రమణ్యం డెడ్‌బాడీ లభించడం స్థానికంగా కలకలం రేపింది. అయితే మృతుడి కుటుంబానికి అండగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు సుబ్రమణ్యం మృతిపై చంద్రబాబు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఎం.ఎస్.రాజు, పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావును చంద్రబాబు ఎంపిక చేశారు. శనివారం నాడు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. MLC Anantha […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 93 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే మిగతా ఆటగాళ్లు కనీస పోరాటపటిమ కూడా చూపించలేదు. కెప్టెన్ ధోనీ 26 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో చాహల్, ఒబెడ్ మెకాయ్ రెండేసి వికెట్లు సాధించగా.. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ […]
ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. గతంలో ఏపీ సీఎం హోదాలో ఈ సదస్సులకు చంద్రబాబు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ పర్యటనపై సెటైర్లు సంధించారు. గతంలో సీఎం హోదాలో చంద్రబాబు దావోస్‌లో పర్యటిస్తే.. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ ఇప్పుడు ఏకంగా స్పెషల్ విమానంలో ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుశా దేవుడి […]
కేదార్‌నాథ్ ఆలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన వికాష్ త్యాగి (33) అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను కేదార్‌నాథ్ ఆలయంలోకి తీసుకువెళ్లాడు. అతడు తన పెంపుడు కుక్కతో నవాబ్ ఆలయ వెలుపల ఉన్న నంది విగ్రహాన్ని తాకాడు. అంతటితో ఆగకుండా తన పెంపుడు కుక్కకు పూజారితో తిలకం దిద్దించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. […]
సూర్యాపేట జిల్లాలో కోదాడ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో, ఎవరితో కలిసి పోటీ చేస్తామో త్వరలో వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పర్యటిస్తారని.. తాను కూడా తెలంగాణలో తిరిగేందుకు సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనే ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. KCR: కేసీఆర్ ఆలిండియా టూర్ […]
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. జాతీయ స్థాయి పార్టీని కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలలోకి తట్టాబుట్టా సర్దేశారు. ఎట్టకేలకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పిలుపు అందింది. దీంతో 8 ఏళ్ల తర్వాత ఆయన సోనియా గాంధీతో సమావేశమయ్యారు. 2014లో జరిగిన ఏపీ విభజన తర్వాత […]
కేరళలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొచ్చిన్ కోస్ట్ గార్డ్ లక్షద్వీప్ దీవులలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. రూ.1,526 కోట్ల విలువ చేసే 218 కేజీల హెరాయిన్ సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేటుగాళ్లు విదేశాల నుండి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు లక్షద్వీప్ దీవులలో అధికారుల బృందం మాటు వేసింది. 12 రోజుల నిరీక్షణ తరువాత రెండు బోట్లలో తరలిస్తున్న డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు […]