Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Pawan Kalyan Demands Ap Government To Reduce Petrol Rates

Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి

Published Date - 05:01 PM, Sun - 22 May 22
By Ramesh Nalam
Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని పవన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమని.. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసరాల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించడం పేదవారికి ఆర్థిక మేలు చేకూరుస్తుందని తెలిపారు.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు హర్షణీయం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/mNNiTl7HuP

— JanaSena Party (@JanaSenaParty) May 22, 2022

పెట్రోల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాలలో కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయని పవన్ ఆరోపించారు. అసలే అస్తవ్యస్థమైపోయిన రోడ్లతో ఏపీ ప్రజల ప్రయాణం భారంగా మారిందని.. వాహనాలు మరమ్మతులకు లోనై ప్రజలు అల్లాడిపోతున్నారని పవన్ తెలిపారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై రోడ్డు సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా జగన్ సర్కారు రూ.600 కోట్లు వసూలు చేస్తోందని గుర్తుచేశారు. అయినా రోడ్లను బాగు చేసే పరిస్థితి ఎలాగూ కనిపించడం లేదన్నారు. కనీసం పెట్రోలు, డీజిల్‌పై స్థానిక పన్నులను తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని పవన్ హితవు పలికారు.

మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన పద్మశ్రీ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని అభిలషిస్తున్నట్లు ట్వీట్‌లో వివరించారు. పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రామయ్య గారు సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలి. పచ్చదనం కోసం ఆయనపడే తపన… చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తాయి. pic.twitter.com/100oNpbTcD

— Pawan Kalyan (@PawanKalyan) May 22, 2022

  • Tags
  • Andhra Pradesh
  • JanaSena Party
  • pawan kalyan
  • petrol rates
  • ycp government

RELATED ARTICLES

Galla Aruna Kumari: నా రాజకీయ జీవితం ముగిసింది.. కానీ టీడీపీకే మద్దతు

CM Jagan: అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు

Vishwak Sen : పవన్ క్లాప్ తో విశ్వక్ సేన్ సినిమా ఆరంభం

MAA :ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు భేటీ!

Andhra Pradesh: ఇకపై తక్కువ ధరకే ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు

తాజావార్తలు

  • Assam Floods: వరదల భీభత్సం..అస్సాంలో 100 దాటిన మరణాలు

  • Viral Video: చేపల కోసం వల వేస్తే.. మైండ్ బ్లాక్.. వీడియో మీరే చూడండి..

  • Viral Video: స్టంట్ చేయబోయాడు.. దఢేల్‌మంటూ తన్నేశాడు

  • Vijayashanti : ‘మహా’ సంక్షోభంపై వ్యంగ్యాస్త్రాలు..

  • KTR Tweet: అలా చేస్తే… మీ కంపెనీకి నేనే అంబాసిడర్ అవుతా.. కేటీఆర్ రిట్వీట్

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions