ఈనెల 25న భారత్ బంద్‌కు ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించకపోవడానికి నిరసనగా పలు డిమాండ్లతో భారత్ బంద్‌కు ఫెడరేషన్ పిలుపు ఇచ్చినట్లు బహుజన్ ముక్తి పార్టీ షహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధిమాన్ వెల్లడించారు. కేంద్రం కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన చేపట్టకపోవడం, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంల కుంభకోణం వంటి అంశాలకు నిరనగా భారత్ బంద్ చేపడుతున్నట్లు ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది.
Raj Thackeray: మోదీజీ యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురండి, ఔరంగాబాద్ పేరు మార్చండి
మరోవైపు రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చేలా చట్టం చేయడం, పాత పెన్షన్ విధానం అమలు చేయడం, NRC ,CAA, NPR ఉపసంహరణ, మధ్యప్రదేశ్, ఒడిశాలో పంచాయితీ ఎన్నికలలో OBC రిజర్వేషన్లు అమలు చేయడం వంటి డిమాండ్లతో పాటు వ్యాక్సిన్‌లపై బలవంతపు ఒత్తిడికి వ్యతిరేకంగా బంద్ చేపట్టనున్నట్లు ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు. కాగా మే 25న భారత్ బంద్ సందర్భంగా వ్యాపారాలు, ప్రజా రవాణాను మూసివేయాలని పలు సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.