దావోస్ పర్యటన వివరాల గురించి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం సాయంత్రం విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలనే తాము దావోస్‌కు వెళ్లామని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్‌లో వివరించామని.. సుమారు 50 ఎమ్మెన్సీ కంపెనీలతో చర్చలు జరిగినట్లు ఆయన వివరించారు. అయితే విశాఖ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయిలో ఎంతగా దెబ్బతీయాలో కొందరు అంత ప్రయత్నం చేశారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. Chandra […]
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనతో వైసీపీ పని అయిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడే ఉంటుందని స్పష్టం చేశారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు. అయితే టీడీపీలోగ్రూపు రాజకీయాలను ఇకపై సహించేది లేదంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఏ స్థాయిలోనూ గ్రూపులను సహించేది లేదని.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్నారు. Telugu Desam Party: 2024 […]
టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన ఆమె మధ్యాహ్నానికి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని ప్రకటించారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వచ్చిన ఓ పోస్టింగ్ ఆధారంగా తొలుత తాను పార్టీకి రాజీనామా చేశానని దివ్యవాణి వివరణ ఇచ్చారు. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్టుగా ఫేస్ బుక్‌లో […]
తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. 72 ఏళ్ల చంద్రబాబు తన వయస్సు గురించిన ఆందోళనలను కూడా పక్కనబెట్టి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. వీలైనంత ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండేందుకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు. వయస్సు గురించి ప్రస్తావిస్తే.. తన వయస్సు గురించి దిగులు చెందాల్సిన పనే లేదంటారాయన. ఆ మాటకొస్తే ప్రధాని మోదీది కూడా […]
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతురులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పండితులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉందన్నారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పట్నుంచో ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ ప్రక్రియపై దృష్టి పెడుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో […]
రిషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం పిల్ వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది. Dhulipalla Narendra: ఏపీలో పశువుల దాణా తరహా కుంభకోణం కాగా ఏపీ ప్రభుత్వం […]
వైసీపీ తరఫున తెలంగాణ నుంచి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఆర్.కృష్ణయ్య రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయటానికి అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు సిగ్గుండాలని.. సీఎంగా పనిచేసిన ఆయన తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాల కోసం మొదటి నుంచి పోరాటం చేస్తోంది తానేనని […]
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతితో రాజస్థాన్ రాయల్స్ భంగపాటుకు గురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ సంజు శాంసన్ ఇదే తప్పు చేశాడు. ఫైనల్లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై విమర్శలు చెలరేగాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సంజు శాంసన్ వివరించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు […]
2020లో ప్రారంభమైన కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత విజయవాడలో రోడ్డుప్రమాదాలు పెరిగాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా 28 బ్లాక్ స్పాట్స్‌ను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న 18 మందిపై కేసులు నమోదు చేశారు.గొల్లపూడి నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే హైవేపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. Internet problems: వాటమ్మా…వాట్ ఈజ్ దిస్ అమ్మా ఈ ఏడాది […]