ఏపీలో జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ రెండు పథకాలను రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. దయచేసి ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ఫ్యాక్ట్‌చెక్ టీం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల 2022 ఏడాదికి గాను ఈ రెండు పథకాలు రద్దు చేసినట్లు కొందరు ఫేక్ ప్రెస్‌నోట్ సృష్టించారని తెలిపింది. వాళ్లను గుర్తించామని, చట్టప్రకారం చర్యలు […]
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి జగన్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. జగన్ మూడేళ్ల పాలనలో ఏపీ పలు రంగాల్లో మంచి అభివృద్ధి సాధించిందని పరిమళ్ నత్వానీ ట్వీట్ చేశారు. జగన్ డైనమిక్, […]
మారుతున్న కాలానికి అనుగుణంగా వాతారణంలో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. గాలి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి వాతావరణంలో మానవాళికి అనేక వ్యాధులు, జబ్బులు రావడం సహజమే. అయితే ప్రధానంగా సీజనల్ జబ్బులు చాలా ఇబ్బందులు పెడుతాయి. మన ఆహారపు అలవాట్లు మారడంతో పాటు శారీరక శ్రమ కూడా తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ,శీతాకాలంలో మాత్రం గొంతునొప్పి సమస్య తీవ్రంగా […]
జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌కు షాక్ తగిలింది. బెంగళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఆయనపై కొందరు వ్యతిరేకులు దాడి చేశారు. అంతేకాకుండా నల్ల సిరా కూడా చల్లారు. రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి కుర్చీలు విసిరి కొందరు దాడికి పాల్పడ్డారు. కొంతకాలంగా రాకేష్ టికాయత్ వర్గానికి, చంద్రశేఖర్ వర్గానికి వైరం నడుస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. Results: సివిల్స్-2021 ఫలితాలు విడుదల ఈ […]
సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ఉదయం విడుదల చేసింది. ఈ సందర్భంగా మొత్తం 685 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. శృతి శర్మ ఆలిండియా నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. అంకిత అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్మా మూడో ర్యాంక్ సాధించారు. పూర్తి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా? […]
కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. 10 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటించగా.. కొందరు సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడాఉన్నారు. 2003-2004లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ అవకాశం ఇస్తామని సోనియా హామీ ఇచ్చారని.. అయితే 18 ఏళ్లు దాటినా తనకు అవకాశం ఇవ్వలేదని నగ్మా ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి […]
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సంబరం ముగిసింది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే అద్భుతంగా రాణించి ఏకంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో స్టార్ క్రికెటర్ల కంటే కొత్త వాళ్లే ఎక్కువగా రాణించారు. రజత్ పటీదార్, ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ, ఆయుష్ బదోనీ లాంటి పలువురు కొత్త ఆటగాళ్లు అంచనాలకు మించి ప్రతిభను చాటుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్‌గా నిలిచినా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను […]
తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన మొత్తానికి విజయవంతంగా ముగిసింది. ఈనెల 18న లండన్ వెళ్లిన ఆయన అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తరువాత స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 45 కంపెనీల బృందాలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాల గురించి క్లుప్తంగా వివరించి అభివృద్ధి పథంలో ముందున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. దీంతో ప్రముఖ కంపెనీలు […]
శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని గుడ్డలూడదీసి కొడతానని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా కొట్టకపోతే తాను దువ్వాడ శ్రీనివాస్‌నే కాదన్నారు. అచ్చెన్నను తన్నటానికి ఒక్క నిమిషం చాలన్నారు. దిక్కుమాలిన టీడీపీకి గత్యంతరం లేక అచ్చెన్నాయుడిని అధ్యక్షుడిని చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. Chinta Mohan: మోదీ చేస్తున్న ఆ పనిని ఆపి తీరుతా.. అందుకే ఢిల్లీ వెళ్లొచ్చా మహానాడు […]