అమరావతి: ప్రతిపక్ష పార్టీ టీడీపీపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు నుంచి టీడీపీ నేతలకు కడుపు మంట ఎక్కువైందని ఆయన ఎద్దేవా చేశారు. మహానాడు ఘన విజయం అంటూ వాళ్ళకి వాళ్లే బుజాలు చరుచుకుంటున్నారని చురకలు అంటించారు. టీడీపీ నేతలు ఎంతటి పతనావస్థలో ఉన్నారనేది వారి ఏడుపు వల్లే కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు. ఏడుపు వాళ్ళ అధికారిక గీతం అయ్యిందని.. అసెంబ్లీ నుంచి చంద్రబాబు ఏడుపు ప్రారంభమైందని […]
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ల ఆధారంగా ఆయన త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రాజకీయరంగ ప్రవేశం చేస్తే గంగూలీ ఖచ్చితంగా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ అంశంపై గతనెలలో రెండు సార్లు గంగూలీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మే 8న గంగూలీ ఇంట్లో అమిత్ షా విందుకు […]
ఏపీలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏసీబీ యాప్ తయారు చేసింది. ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్ రూపొందించింది. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనపై సమీక్ష కార్యక్రమంలో ఏసీబీ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఉండకూడదని స్పష్టంగా చెప్పామని.. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా […]
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మాజీ సీఎం చంద్రబాబును గ్రూప్-1 అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-1 నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లో 62శాతం వ్యత్యాసం ఉందన్నారు. డిజిటల్ మూల్యాoకానం, మాన్యువల్ మూల్యాంకనంలో 62 శాతం ఫలితాలు తేడా రావటమే […]
అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్, ISSF షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ఇషా సింగ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నగదు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపింది. కాగా ఇటీవల టర్కీ […]
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్బ్యాంక్ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్మేనేజర్ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది. ఆయా విభాగాల్లో మొత్తం 1,544 ఖాళీలు ఉన్నట్లు ఐడీబీఐ వెల్లడించింది. 1044 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మరో 500 అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు ఐటీబీఐ ప్రకటించింది. 20-25 ఏళ్ల వయస్సువారు ఎగ్జిక్యూటివ్, 21-28 ఏళ్ల వయస్కులు అసిస్టెంట్‌మేనేజర్ పోస్టులకు అర్హులు అని తెలిపింది. Health Tips: బట్టతలపై తిరిగి జుట్టు పెరగాలా? ఈ చిట్కాలు పాటించండి ఆయా ఉద్యోగాలకు […]
ఏపీలో జూన్ 1 సందర్భంగా పెన్షన్‌ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం రూ.1,543.80 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పెన్షన్‌ల పంపిణీ వివరాలను అందజేశారు. Tulasireddy: దావోస్‌కి కాదు.. ఢిల్లీకి వెళ్ళి సాధించండి ఉదయం 7 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా వాలంటీర్లు సుమారు […]
విజయవాడలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. నగరంలో నివసిస్తున్న అమృతరావు కొంతకాలంగా జి.కొండూరు మండలంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతడు వాట్సాప్ గ్రూప్ ద్వారా మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు ఆర్ఎంపీ డాక్టర్ అమృతరావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. Self Destruction Note: ప్రియుడి ఆత్మహత్య.. ఖర్చుచేసిన డబ్బు కావాలని లేఖ రూ.3 లక్షలకు పసిపాపను అమ్మకానికి పెట్టినట్లు […]
ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ, సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మోహన్ రావు, అంకయ్య, రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు […]
ప్రస్తుతం వినియోగదారులకు భారంగా మారిన టెలికాం ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరో విడత టారిఫ్‌లు పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో వెల్లడించింది. టెలికాం సంస్థలు తమ నెట్‌వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందని… ఒకవేళ అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని […]