Minister Kottu Satyanarayana: ప్రధాన ఆలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతురులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పండితులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉందన్నారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పట్నుంచో ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ ప్రక్రియపై దృష్టి పెడుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
దేవాదాయ శాఖకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. సమస్యల పరిష్కారానికి ప్రతివారం సమీక్షలు జరుపుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కమిటీలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ధార్మిక పరిషత్‌తో పాటు మరికొన్ని కమిటీలు ఉన్నాయని.. సీజీఎఫ్‌కు సంబంధించి కొంత మంది సభ్యుల నియామకం కావాల్సి ఉందన్నారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్‌కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. సీజీఎఫ్‌కు సంబంధించి కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
కొన్ని నియామకాలు కూడా చేస్తున్నామన్నారు. సీజీఎఫ్ పురోగతిపై ప్రతినెలా సమీక్ష ఉంటుందన్నారు. న్యాయ పరమైన అంశాలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దాదాపు ఐదు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అదనపు న్యాయ సలహాదారు పోస్ట్ కోసం ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో అవినీతి లేదని చెప్పలేమని.. అవినీతిని అరికట్టడానికి విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయంలో మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు. కనక దుర్గ గుడిని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని తెలిపారు. ప్రతి దేవాలయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని దేవాలయాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
తాజావార్తలు
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!