టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన ఆమె మధ్యాహ్నానికి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని ప్రకటించారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వచ్చిన ఓ పోస్టింగ్ ఆధారంగా తొలుత తాను పార్టీకి రాజీనామా చేశానని దివ్యవాణి వివరణ ఇచ్చారు. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్టుగా ఫేస్ బుక్‌లో పోస్టు వచ్చిందని ఆమె తెలిపారు.
Telugu Desam Party: 2024 ఎన్నికలు టీడీపీకి అతి పెద్ద సవాలే..!!
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యవాణి టీడీపీలో చేరారు. ధాటిగా మాట్లాడగలగడంతో ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు. అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. అయితే మహానాడులో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఇప్పటికే దివ్యవాణి ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే తాము దివ్యవాణిని సస్పెండ్ చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ కొందరు తప్పుడు పోస్టింగులు పెట్టారని.. వాటి ఆధారంగా ఎలా రాజీనామా చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని కూడా సస్పెండ్ చేసినట్లు కొందరు ఫేక్ పోస్టింగులు పెట్టారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.