అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనతో వైసీపీ పని అయిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడే ఉంటుందని స్పష్టం చేశారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు. అయితే టీడీపీలోగ్రూపు రాజకీయాలను ఇకపై సహించేది లేదంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఏ స్థాయిలోనూ గ్రూపులను సహించేది లేదని.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్నారు.
Telugu Desam Party: 2024 ఎన్నికలు టీడీపీకి అతి పెద్ద సవాలే..!!
టీడీపీ కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తెచ్చిన న్యూట్రిఫుల్ యాప్ ద్వారా సేవలు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ కార్యకర్తల్లో కసి.. వైసీపీ పాలనపై ప్రజల అసంతృప్తే మహానాడు గ్రాండ్ సక్సెస్‌కు కారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒంగోలు నేతలు సమిష్టి కృషితో మహానాడును సక్సెస్ చేశారని.. ఒంగోలు నేతలది సక్సెస్ ఫార్మూలా.. దాన్ని అందరూ ఫాలో అవ్వాలని సూచించారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా కసిగా ఉన్న ఈ పరిస్థితుల్లో గ్రూప్ రాజకీయాలు ఎంతమాత్రం మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు.