టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మంచి ఫినిషర్ అనే ముద్ర వేయించుకున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ధోనీ తరహాలో ఆడే ఫినిషర్ కోసం టీమిండియా గాలిస్తూనే ఉంది. అయితే తాజాగా టీమిండియాకు ధోనీ తర్వాత మరో ఫినిషర్ దొరికేశాడని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన దినేష్ కార్తీక్ ధోనీ స్థానంలో ఫినిషర్ రోల్ పోషించగలడని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్ […]
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వాయిదా వేయడంపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. టెన్త్ ఫలితాలను నిర్ణీత సమయానికి ప్రకటించకపోవం ప్రభుత్వం చేతకానితననానికి నిదర్శనమని ఆరోపించారు. పదోతరగతి ఫలితాలకు సంబంధించి ఆలస్యం, అయోమయం, ఎందుకింత గందరగోళం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్నటి వరకు పేపర్ లీక్ వార్తలు, ఇప్పుడు ఫలితాలు ప్రకటించలేని నిస్సహాయతను చూస్తుంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని గంటా ఆరోపించారు. Andhra Pradesh: రేపు మధ్యాహ్నం […]
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సేవ్ సాయిల్ పేరిట ప్రపంచంలోని 27 దేశాల్లో పర్యటించిన సద్గురు ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి సాంద్రత మెరుగు పరిచినప్పుడే గ్రామీణ భారత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మట్టిని రక్షించుకోవడం అందరి బాధ్యత అని సద్గురు గుర్తుచేశారు. మట్టి పునరుత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఇప్పటి వరకు 2.5 బిలియన్ల ప్రజలు సేవ్ సాయిల్ గురించి […]
దేశంలో ఇప్పటివరకు మన కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మ గాంధీ ఫోటోలను మాత్రమే ఆర్‌బీఐ ముద్రించింది. అయితే కరెన్సీ నోట్లపై తాజాగా మరో ఇద్దరు ప్రముఖుల చిత్రాలు ముద్రించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫొటోలను కొత్తగా విడుదలయ్యే కొన్ని డినామినేషన్ నోట్లపై ముద్రించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించినట్లు తెలుస్తోంది. Secunderabad Railway Station: అడల్ట్ కంటెంట్‌లో టాప్.. మొత్తం […]
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మెగా అభిమాన సంఘాల నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేప పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అంధకారంలోకి వెళ్లిపోతున్న ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా మారి బాధ్యత తీసుకోవాలని కోరారు. 2019 ఎన్నికల్లో జరిగిన పొరపాటు మళ్లీ […]
2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో వలస కూలీలు కాలి నడకన లేదా సైకిళ్ల మీద సొంతూళ్లకు వెళ్లారు. యూపీలో కొందరు వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్‌లో వదిలి వెళ్లారు. ఎందుకంటే సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు మెయిన్ సెంటర్‌గా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కూలీలు భారీ ఎత్తున సైకిళ్లు వదిలివెళ్లారు. […]
ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈనెల 6న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తొలుత శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. Devineni Uma : ఆ విషయంలో జగన్ […]
ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీ బిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ పాల్గొననుంది. ఈనెల 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 ఢిల్లీలో, రెండో టీ20 కటక్‌లో, మూడో టీ20 విశాఖలో, నాలుగో టీ20 రాజ్‌కోట్‌లో, ఐదో టీ20 బెంగళూరులో జరగనున్నాయి. అయితే ఈనెల 14న విశాఖలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు యమా క్రేజ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన […]
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అమెరికా ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా ఉత్తర కొరియా మాత్రం వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపడుతూనే ఉంది. తాజాగా రాజధాని ప్యాంగాంగ్‌కు సమీపంలోని సునన్ ప్రాంతంలో 35 నిమిషాల వ్యవధిలో 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఒక్కరోజులో ఉత్తర కొరియా ప్రభుత్వం అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. Monkey […]