వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పాలనలో నిత్యం హత్యలు, దాడులు, మహిళలపై మానభంగాలతో రాష్ట్రం వల్లకాడులా మారిందని విమర్శించారు. మాచర్లలో జల్లయ్య హత్య ముమ్మూటికి వైసీపీ ప్రభుత్వ హత్యే అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా పోస్టుమార్టం చేసి తీసుకెళ్లారని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా టీడీపీ నేతల్ని, బీసీ సంఘాల నేతల్ని హౌస్ అరెస్టులు చేయటం దుర్మార్గం […]
విజయవాడ రాజ్‌భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి […]
బీహార్‌లో కులాల వారీగా జనగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై అక్కడి ప్రభుత్వంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను కూడా లెక్కించాలని మంత్రి నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ తాజాగా డిమాండ్ చేశారు. ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరికి ముగ్గురు భార్యలు, 15-20 మంది వరకు పిల్లలు ఉన్నారని.. వారు జనాభా లెక్కల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జనాభా లెక్కల్లోకి రాకూడదన్నది వారి ఆలోచన […]
దేశంలోని యువతకు గుండెపోటు టెన్షన్ పట్టుకుంది. గుప్పెడంత గుండె చిన్న వయసులోనే ముప్పుకు గురవుతోంది. దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు భయం వెంటాడుతోంది. వీరిలో ఎక్కువగా భారతీయులే ఉండటం కలవరపెడుతోంది. అయితే మహిళల కంటే పురుషుల్లోనే గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఓ సర్వేలో స్పష్టమైంది. గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో 21.4 శాతం, మహిళల్లో 12.7 శాతంగా ఉందని తేలింది. ఫిట్‌గా ఉన్నా కొంచెం ఫ్యాట్ ఎక్కువైనా గుండెపోటు వస్తుండటంతో ఏం […]
కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. దేశంలో మరోసారి కరోనా కేసులు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తాను కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా […]
ప్రపంచ మాజీ సుందరి, ప్రముఖ నటి మానుషి చిల్లర్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌పై హాట్ కామెంట్స్ చేసింది. తనకు రామ్‌చరణ్ అంటే క్రష్ అని.. అతగితే డేట్‌కు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా చూశాక రామ్‌చరణ్‌కు తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని మానుషి చిల్లర్ చెప్పింది. ప్రస్తుతం మానుషి చిల్లర్ ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్విరాజ్’ చిత్రంలో మానుషి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా […]
త్వరలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది అర్ధంతరంగా ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు ఐదో టెస్టు ఆడనున్నాయి. అయితే గతంలో ఫామ్ కోల్పోయిన పుజారా ఏకంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అతడు తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతూ ఫామ్ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో పుజారా స్థానంలో విహారి మంచి ప్రదర్శన చేశాడు. దీంతో తుది జట్టులో స్థానం కోసం పుజారా, హనుమా విహారి మధ్య […]
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ పొందడం ప్రస్తుత మన విద్యా విధానం. మున్ముందు కోర్సు అవగానే కొలువులు సాధించేలా విద్యార్థులు సుశిక్షితులు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానానికి ఈ పాఠశాలలు ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయని ఆయన అభివర్ణించారు. […]
ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోవడంతో అందరూ సైకిళ్లను పక్కనపెట్టేసి బైకులు, కార్లనే వాడుతున్నారు. దీంతో సైకిల్ వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతున్నారు. అందుకే 2016లో ప్రపంచ సైక్లింగ్ అలయెన్స్ (డబ్ల్యూసీఏ), ఐరోపా సైక్లిస్ట్స్ సమాఖ్య (ఈసీఎఫ్) కలిసి ప్రతి ఏడాది ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిని కోరాయి. […]
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్(APREI) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీవో నెం.40 వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్ నరసింహరావు మెమో జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు […]