ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రేపటి నుంచి ఈ నెల 13 వరకు హర్యానాలోని పంచకులలో ప్రారంభం కానున్నాయి. 25 క్రీడావిభాగాల్లో మొత్తం 4,700 మంది అథ్లెట్లు పోటీ పడుతుండగా.. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్‌తో పాటు ఇతర క్రీడలను ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో నిర్వహించనున్నారు. అంబాల, షాహాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీలోని మైదానాల్లో ఈ గేమ్స్ జరగనున్నాయి. COMMONWEALTH […]
హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. కేవలం 10 నిమిషాల్లో లిక్కర్ హోం డెలివరీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ ఇచ్చింది హైదరాబాద్‌లో కాదు.. కోల్‌కతాలో. ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ బూజీ అనే బ్రాండ్‌తో కోల్‌కతాలో లిక్కర్ డోర్ డెలివరీ సర్వీసు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్పేర్కొంది. […]
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించింది. ఇకపై గ్యాస్ సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో సామాన్యులు మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కరోనా తర్వాత సామాన్యులకు అంతంత మాత్రంగానే గ్యాస్ సబ్సిడీ పడుతోంది. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో గ్యాస్ సిలిండర్ […]
★ ఢిల్లీ: ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ ★ కాకినాడ జిల్లా: నేడు జిల్లాలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ పర్యటన.. సాయంత్రం 4:30 గంటలకు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని.. సా.6 గంటలకు పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్న సునీల్ దియోధర్ ★ గుంటూరు: సోషల్ మీడియాలో పోస్టులపై అచ్చెన్నాయుడు పీఏ వెంకటేష్‌ను రెండో రోజు విచరించనున్న సీఐడీ పోలీసులు ★ బాపట్ల జిల్లా: నేడు […]
మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే చంద్రబాబు సమీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్‌తో చర్చించారు. CM Jagan: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్ చిత్తూరు, తిరుపతి పార్లమెంటుల పరిధిలోని నేతల పని తీరుపై చంద్రబాబుకు బీదా రవిచంద్ర […]
వైద్య విద్యలో పీజీ చేసేందుకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ 2022 ఫలితాలను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈమేరకు నీట్ పీజీకి అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే రికార్డుస్థాయిలో నీట్ పీజీ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ఎగ్జామినేషన్ఇన్ మెడికల్ సైన్సెస్‌ను(NBEMS) కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ ప్రశంసించారు. Central Government: జనాభా నియంత్రణ […]
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి సీఎం జగన్ షాకిచ్చారు. ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేయడంతో కొత్తపల్లిని జగన్ సస్పెండ్ చేశారు. తనకు వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా తనకు ఓట్లు పడతాయని మంగళవారం నాడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ ప్రకటించకుండా తాను వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. […]
ఏపీలోని రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. జూన్ నెలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బుధవారం నాడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ప్రకటించారు. జూన్ 7న రైతన్నలకు 3,800 ట్రాక్టర్లు సహా 5వేలకు పైగా వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. అంతేకాకుండా జూన్ 14న రైతులకు పంటల బీమా పరిహారం చెల్లిస్తామన్నారు. జూన్ 23న అమ్మ ఒడి నిధులను విడుదల చేస్తామని జగన్ తెలిపారు. YSRCP: వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ.. భారీ ఎత్తున […]
దేశంలో జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టం తేనుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. జనాభా పెరుగుదలతో సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉంది. దీంతో జనాభా నియంత్రణపై ఎలా చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను మీడియా ప్రశ్నించింది. […]
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీని భారీ ఎత్తున నిర్వహించేలా వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ ప్లీనరీని నిర్వహించాలని సీఎం జగన్ వైసీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉండటంతో వైసీపీ ప్లీనరీని ఎక్కడ నిర్వహించాలి అనే విషయంపై వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ప్రారంభించి పదేళ్లు పూర్తి కావడం, సీఎంగా జగన్ […]