కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ 23 మంది విద్యార్థినులు నిరసన తెలిపారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారందరినీ వారంపాటు సస్పెండ్ చేసింది. విద్యార్థినులు వారం పాటు కాలేజీకి రాకుండా నిషేధం విధించింది.
అయితే ఈ ఏడాది మార్చిలో హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును విద్యార్థినులు బేఖాతరు చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇస్లాంలో హిజాబ్ ప్రస్తావన లేదని, విద్యాసంస్థల్లో ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ నిబంధనను పాటించాలని కర్ణాటక హైకోర్టు తీర్పును వెల్లడించింది. అయినా హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యార్థులు పట్టుబడుతుండటంతో కాలేజీ యాజమాన్యాలకు ఏం చేయాలో అంతుచిక్కడం లేదు.