YSRCP: సీఎం జగన్ సీరియస్.. జీరో పెర్ఫార్మెన్స్‌తో ఏడుగురు ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం నాడు సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలకు ఎదురైన అనుభవాలు, ప్రజలు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం ఎలా అన్న అంశాలపై చర్చించేందుకే సీఎం జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాకిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఎవరెవరు ఎన్ని రోజులు గడప గడపకు వెళ్ళారో గణాంకాల రిపోర్టును సీఎం జగన్ బహిర్గతం చేశారు. ఈ నివేదికలో జీరో పెర్ఫార్మెన్స్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. గడప గడపకు కార్యక్రమానికి స్వయంగా వెళ్ళకుండా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు జగన్ దృష్టికి వచ్చింది. దీంతో అందరూ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ స్పష్టం చేశారు. గడప గడపకు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. పని తీరు మెరుగు పరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
Gudivada Amarnath: గడప గడపకు కార్యక్రమంలో ప్రతి ఇల్లు టచ్ చేస్తాం
గడప గడపను టచ్ చేయటంలో చీఫ్ విప్ ప్రసాదరాజు మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. జీరో పెర్ఫార్మెన్స్‌లో ఆళ్ల నాని, వసంత కృష్ణప్రసాద్, శిల్పా చక్రపాణిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఉన్నారని సమాచారం. అయితే ఏపీలో ఇప్పటికే 90 శాతానికి పైగా మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చామని.. 100 శాతం చేయడటం ఎవరికీ సాధ్యం కాదని సీఎం జగన్ అన్నారు. చేయలేక పోయిన అంశాలను ఎందుకు చేయలేకపోయామో ప్రజలకు వివరించాలని వైసీపీ నేతలకు జగన్ సూచించారు.
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!