భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే తొలి టీ20 జరిగే ఢిల్లీలో రాత్రిపూట కూడా వడగాలులు వీస్తున్నాయి. ఉదయం వేళల్లోనే ఢిల్లీలో ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటోంది. మధ్యాహ్నం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీలను టచ్ చేస్తోంది. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో ఢిల్లీవాసులు ఇక్కట్లకు గురవుతున్నారు. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Team India: సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు షాక్.. కెప్టెన్ అవుట్..!!
ఢిల్లీలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలి టీ20 మ్యాచ్ కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ప్రతి 10 ఓవర్లకు ఒకసారి డ్రింక్స్ బ్రేక్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. సాధారణంగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లల్లో డ్రింక్స్ బ్రేక్స్ ఉండవు. రెండు జట్లు కూడా ఏకధాటిగా 20 ఓవర్లను ఆడేస్తాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి టోర్నీల్లో మాత్రం దీనికి మినహాయింపు. ప్రతి ఆరు ఓవర్లకోసారి టైమ్ అవుట్ ఉంటుంది. కాగా 10 ఓవర్లకోసారి డ్రింక్స్ బ్రేక్ అనేది ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం అవుతుందా? లేదా ఈ సిరీస్ మొత్తానికి అంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లకూ కొనసాగిస్తుందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.