ఏపీలో అటవీ భూముల ఆక్రమణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు విజయవాడలో క్యాంప్ కార్యాలయలో అటవీ, రెవెన్యూ, సర్వే, సెటిల్ మెంట్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జగనన్న భూహక్కు-భూరక్ష కింద సర్వే జరుగుతోందని.. సర్వే చేసే క్రమంలో ఆక్రమణకు గురైన అటవీభూములను నిర్ధిష్టంగా గుర్తించాలని అధికారులకు సూచించారు. చట్టప్రకారం అటవీ భూములకు సర్వే […]
అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన టీడీపీ నేతలతో చర్చించారు. తన పర్యటనలే కాకుండా.. పార్టీ పరంగా కూడా వివిధ సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. అయితే ముందుగా రైతు సమస్యలపై ఉద్యమిద్దామని టీడీపీ నేతలు సూచించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఉద్యమించాలని భేటీలో నిర్ణయించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో […]
ఏపీలో టీడీపీ అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తుండటంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ‘పబ్లిక్ స్థలాలు ఆక్రమించి రచ్చ చేయడం, డ్రామాలు వేయడం ఏంటి బొల్లిబాబు? సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్దె భవనాల్లో అన్న క్యాంటీన్స్ పెట్టుకోండి.. రోడ్లు మీ అబ్బ జాగీరు కాదు.. మీ ఇష్టానికి ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేస్తామంటే ఎలా? […]
తిరుమలలో శ్రీవారి జ్యేష్టాభిషేకం ఈనెల 12 నుంచి 14 వరకు జరగనుంది. వీటికి సంబంధించిన సేవా టికెట్లను రేపటి నుంచి విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జ్యేష్టాభిషేకం టికెట్లు కరెంట్ బుకింగ్‌లో అందుబాటులో ఉంటాయంది. రోజుకు 600 చొప్పున టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి జ్యేష్టాభిషేకం సేవలో పాల్గొనాలని భావించే భక్తులకు ప్రత్యేకంగా టిక్కెట్లను కూడా విక్రయిస్తున్నట్లు టీడీపీ తెలిపింది. TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక నిర్ణయం.. అయితే శ్రీవారి […]
రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు ఫలితం వచ్చేలా కనిపించకపోవడంతో అంపైర్లు గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేసి డ్రాగా ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సెంచరీ చేయడం విశేషం. 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారీ తన […]
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం మధ్యాహ్నం కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకు 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని […]
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో వారాంతంలో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,016 పాయింట్ల భారీ నష్టంతో 54,303 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 276 పాయింట్ల నష్టంతో 16,201 వద్ద స్థిరపడింది. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు రావడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఉదయం నుంచే సూచీలు డీలాపడ్డాయి. దీంతో మదుపర్లు తమ షేర్లను అమ్మేందుకు సిద్ధపడ్డారు. Face Book: ఫేస్‌బుక్‌లో కీలక మార్పులు.. మారనున్న టికర్, […]
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇప్పటికే ఎంతోమందితో మొక్కలు నాటిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ మొక్కల ఉద్యమంలో విరివిగా పాల్గొంటూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ రూపాన్ని రావి ఆకుపై చిత్రించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముక్ర కె గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్గే రావి ఆకుపై సంతోష్ చిత్రాన్ని […]
జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు రానున్నాయని నాదెండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. మార్చిలోనే ఎన్నికలు జరగబోతుండటంతో జనసైనికులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రం బాగుండాలంటే జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది వ్యక్తిగత లబ్ధి కోసం కాదని.. ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసమే ఆయన పార్టీ పెట్టారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. […]
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో చాలా మంది ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. అయితే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌లో కీలకమార్పులు జరగబోతున్నాయి. బ్లూరంగులో కనిపించే ఫేస్‌బుక్ టికర్ ఇకపై కనిపించదు. దాని స్థానంలో మెటా టికర్, లోగోను త్వరలో తీసుకురాబోతున్నామని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఆ టికర్‌తోనే ట్రేడింగ్ చేస్తామని అమెరికా స్టాక్‌మార్కెట్ నాస్‌డాక్‌కు తెలిపారు. 2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించగా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన టికర్, లోగోనూ […]