Kurnool District: నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం చోటు చేసుకుంది. నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కోసిగి మూడోవార్డులో నాలుగు రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. కొన్ని పండ్లను చిన్నారుల తల్లి మాదేవి కూడా తిన్నది. అయితే కాసేపటికే నలుగురు చిన్నారులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని కుటుంబీకులు ఆదోనీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అయితే నేరేడు పండ్లను తిన్నరోజే హర్ష అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం నాడు అస్వస్థతకు గురైన చిన్నారుల్లో అంజి అనే నాలుగేళ్ల చిన్నారి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నేరేడు పండ్ల తిని మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. అయితే నరసప్ప అనే రైతు పొలం నుంచి మాదేవి అత్త నరసమ్మ ఈ నేరేడు పండ్లను తీసుకొచ్చింది. ఈ పండ్లను తిన్న తర్వాతే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. క్రిమిసంహారక మందులకు సంబంధించిన కవర్‌లో నేరేడుపండ్లు తీసుకురాగా.. ఆ పండ్లను కడగకుండా అలాగే తినడంతోనే ఇలా అస్వస్థతకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల శరీరంలోకి పాయిజన్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ఎవరైనా పండ్లను తినేటప్పుడు నీటితో శుభ్రంగా కడుక్కుని తినాలని సూచిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!