అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రం రెండో వారంలోనూ సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సినిమా యూనిట్ ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ను ప్రకటించింది. టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. పాఠశాల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా షో వేస్తామని, అందుకోసం majorscreening@gmail.comకి మెయిల్ చేసి ఈ అవకాశాన్ని పొందొచ్చని మేజర్ సినిమా యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
మరోవైపు మేజర్ సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు హీరో అడివి శేష్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాను చూసిన చాలామంది చిన్నారులు తనకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారన్నాడు. తాము చేసిన ఈ సినిమాకు చిన్నారుల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అందుకే ఈ సినిమాను చిన్నారుల కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించామన్నాడు. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నట్టు తెలిపాడు. సందీప్ ఉన్నికృష్ణన్ గురించి రేపటి తరానికి తెలియాలనేదే తమ లక్ష్యమన్నాడు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. కాగా మేజర్ సినిమా టీమ్‌ను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రత్యేకంగా ప్రశంసించిన సంగతి తెలిసిందే.
Team #MajorTheFilm 🇮🇳 has some exciting news for all the children and schools ❤️
Witness the Life of Major Sandeep Unnikrishnan on Big Screens with 50% discount on tickets 💥💥
School management can write to majorscreening@gmail.com and register yourself for the special show. pic.twitter.com/VOmKYhgZXd
— GMB Entertainment – MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 14, 2022