కోలీవుడ్‌లో ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200లకు పైగా సినిమాలు రిలీజైతే.. పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లోబడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు పది సినిమాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తడబడ్డారు. రజనీకాంత్ రూ.500 కోట్లు కొల్లగొట్టినా తమిళ తంబీలకు శాటిస్పాక్షన్ లేదు. కమల్ హాసన్ దెబ్బ మీద దెబ్బేశారు. విజయ్ పలకరించనే లేదు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో కాస్త బెటర్ అనిపించుకున్నారు. పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు ఫెయిలైన వేళ.. చిన్న హీరోలే కోలీవుడ్ పరువును నిలబెట్టారు.
టూరిస్ట్ ఫ్యామిలీ:
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సెన్సేషనల్ హిట్ అందుకుంది. రూ.7 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది.
డ్రాగన్, డ్యూడ్:
ప్రదీప్ రంగనాథన్‌కు తమిళ తంబీలు రెండు హిట్స్ అందించారు. డ్రాగన్, డ్యూడ్‌తో డబుల్ ధమాకా అందుకున్నాడు. సుమారు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తీసిన టూ ఫిల్మ్స్.. వంద కోట్లకు పైగా కాసులు రాబట్టుకున్నాయి.
మదగజరాజా:
ఇక విశాల్ మూవీ ‘మదగజరాజా’ అయితే ఎప్పుడో కంప్లీటై 12 ఏళ్ల పాటు ల్యాబ్‌లో మగ్గి.. ఈ ఏడాది మోక్షం దక్కించుకుంది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా రూ.50 కోట్లను రాబట్టుకుంది.
బైసన్:
సరైన హిట్ లేక సతమతమౌతున్న ధ్రువ్ విక్రమ్‌కు 2025 ‘బైసన్’ రూపంలో మంచి సక్సెస్ దొరికింది. విక్రమ్ వీర ధీర శూరన్‌తో పోల్చుకుంటే.. బెటర్ కలెక్షన్స్ చూశాడు ధ్రువ్. రూ.55 కోట్లతో తెరకెక్కిన వీర ధీర శూరన్ రూ.70 కోట్లు వసూలు చేస్తే.. బైసన్ రూ.30 కోట్లతో తెరకెక్కి వంద కోట్లకు పైగా రాబట్టుకుంది.మరికొన్ని సినిమాలపై కూస్తో తమిళ తంబీలు కాసుల వర్షం కురిపించారు.
Also Read: Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్‌లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
కుడుంబస్తాన్:
మణికందన్ హీరోగా తెలుగుమ్మాయి శాన్వీ మేఘన జోడీగా నటించిన ‘కుడుంబస్తాన్’ సాలిడ్ హిట్ నమోదు చేసింది. రూ.8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపుగా రూ.30 క్రోర్స్ కొల్లగొట్టింది.
తలైవన్ తలైవి:
రూ.25 కోట్లతో తెరకెక్కిన విజయ్ సేతుపతి-నిత్యామీనన్ ‘తలైవన్ తలైవి’ కూడా హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేసింది. ఇక చిన్న సినిమాలుగా వచ్చి మంచి రెస్పాన్స్‌తో పాటు బ్రేక్ ఈవెన్ తెచ్చుకున్నాయి పెరసు, డీఎన్ఎ, అన్ పావం పల్లపోతు, మామన్, 3బీహెచ్కే చిత్రాలు. తమిళ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హీరోలు ఫెయిలయితే.. చిన్న హీరోలు, లోబడ్జెట్ చిత్రాలే కోలీవుడ్ పరువును నిలబెట్టాయి.