ఇటీవల మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం దిగిపోయేముందు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని డాక్యుమెంట్లలో, బోర్డుల మీద ఔరంగాబాద్ పేరును మార్చాల్సి ఉంటుంది. తాజాగా ఈ అంశంపై ఔరంగాబాద్ ఎంపీ, AIMIM పార్టీ నేత ఇంతియాజ్ జలీల్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా థాక్రే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. సాధారణంగా చిన్న పట్టణానికి పేరు మార్చడం కోసం రూ.500 […]
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23లో శ్రీలంక జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. డబ్ల్యూటీసీ సెకండ్ ఫేజ్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్థానానికి దెబ్బ పడటంతో పాటు టీమిండియా స్థానానికి కూడా శ్రీలంక ఎసరు తెచ్చింది. తాజా ఓటమితో […]
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం 16,678 కేసులు నమోదు కాగా మంగళవారం 13,615 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు గత 24 గంటల్లో 3వేల వరకు తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు. మరోవైపు తాజాగా 20 మంది కరోనా చనిపోయారు. కోవిడ్ నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23 […]
చైనాకు చెందిన ఒప్పో, వన్ ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఆదేశాలతో జర్మనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూరప్ వ్యాప్తంగా నోకియా సంస్థ 5G నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్ చేసే టెక్నాలజీపై పేటెంట్ హక్కులను కలిగి ఉంది. దీని కోసం నోకియా సుమారు 129 బిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. అయితే ఒప్పో, వన్ ప్లస్ […]
టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు ప్రేక్షకులకు రుచించడం లేదు. కృష్ణవంశీ కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ వరకు గుర్తుండిపోయే సినిమాలు తీసిన కృష్ణవంశీ ఆ తర్వాత హిట్ అందుకోలేకపోయారు. లేటెస్టుగా ఆయన ‘రంగ మార్తాండ’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ […]
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియాలోని పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని ఉద్యోగులకు కంపెనీలు కల్పించాయి. గతంతో పోలిస్తే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే నెదర్లాండ్స్‌లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానం ఉద్యోగుల హక్కుగా మారనుంది. ఈ ప్రతిపాదనపై డచ్ పార్లమెంట్ దిగువ సభ గత […]
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి సింహగిరి ప్రదక్షిణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కొండ చుట్టూ 32 కి.మీ.మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు 4 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. వారికి ఇబ్బంది కలగకుండా అధికారులు పలు చోట్ల మంచినీరు, మెడికల్ క్యాంపులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 […]
నేడు ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలివన్డే జరగనుంది. ఇటీవల మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సోమవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీసుకు విరాట్ కోహ్లీ హాజరుకాలేదు. దీంతో కోహ్లీ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడతాడా, లేదా అనేదానిపై అస్పష్టత నెలకొంది. కోహ్లీ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మూడో టీ20 సందర్భంగా విరాట్‌కు గజ్జల్లో గాయమైంది. ఈ నేపథ్యంలో అతడు […]
అన్నాడీఎంకేలో జయలలిత మరణం తర్వాత వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు బలమైన నేతలుగా ముద్రపడ్డ పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారే నంబర్‌వన్ అవ్వాలన్న కాంక్ష వీరి మధ్య దూరాన్ని పెంచింది. తాజాగా అదును చూసి పన్నీర్ సెల్వంను పళనిస్వామి దెబ్బకొట్టారు. సోమవారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయ్యారు. మరోవైపు పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి […]
సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అహంకారం తొలగిపోయేరోజు దగ్గరలోనే ఉందన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. కానీ కేసీఆర్ తనను పదే పదే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేశారని.. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని ఈటల అన్నారు. కేసీఆర్ తరహాలో తాను సంస్కారం లేకుండా మాట్లాడనని […]