Cuddle Therapy: గంటసేపు కౌగిలించుకుంటే.. రూ.7వేలు ఇవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో అందరినీ కౌగిలించుకుంటూ ఉంటాడు. అలా చేస్తే మనసులోని ఆందోళన మటుమాయం అవుతుందని చెప్తుంటాడు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. కాకపోతే ఆ సినిమాలో హీరో ఉచితంగా కౌగిలించుకుంటే.. రియల్ లైఫ్‌లో మాత్రం ఆ వ్యక్తి కౌగిలించుకుంటే గంటకు ఇంత అని వసూలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తమ మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి భరోసా కల్పించేలా బ్రిటన్ బ్రిస్టల్‌కు చెందిన ట్రెజర్ ప్రయత్నిస్తున్నాడు. అతడిని సంప్రదించగానే ఇంటికి వచ్చి బాధితుడిని దగ్గరకు తీసుకుంటాడు. కౌగిలించుకుని వారి చెప్పింది వింటాడు. తల నిమురుతూ ఆందోళన తగ్గేలా చేస్తాడు. దీని పేరు కడల్ థెరపీ. ఇదంతా ఊరికే కాదండోయ్. గంటకు 75 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.7వేలు వసూలు చేస్తాడు.
Read Also: Organ Donation: తను చనిపోయి.. ఐదుగురిని బతికించింది
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
అయితే కౌగిలించుకోవడానికి అతడే ఎందుకు.. పైగా డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఇంట్లో ఎవరినైనా లేకపోతే స్నేహితులనో, బంధువులనో కౌగిలించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారా.. ఇదీ నిజమే అయినా అందరికీ బంధువులు ఉండరు. కొందరికి స్నేహితులు కూడా ఉండరు. అందరికీ అలాంటి అదృష్టం ఉండదు. మానవ సంబంధాలు లేకపోవడం వల్ల ఎంతోమంది మానసికంగా కుమిలిపోతున్నారు. ఈ ఆధునిక సమాజంలో ఈ పోకడ మరింత తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ఈ అంశాన్ని కూడా కొందరు వ్యాపారం చేసేస్తున్నారు. ఒంటరితనంతో మానసికంగా క్షోభ పడేవారికి స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతోనే ట్రెజర్ ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా ఇది వృత్తిగా మారిపోయింది. ఈ వృత్తి కింద పనిచేసే వాళ్లను ప్రొఫెషనల్ కడలర్స్ అని పిలుస్తున్నారు. కడల్ థెరపీ అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కో తరహాలో ఉంటుందని.. కేవలం కౌగిలింత మాత్రమే కాకుండా వారు కోరుకున్న స్నేహాన్ని, ఓ వ్యక్తి మనకు తోడున్నాడన్న భావనను వాళ్లలో కలిగిస్తానని ట్రెజర్ వివరించాడు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..