Lal Singh Chaddha: మెగాస్టార్ సమర్పణలో వస్తున్న బాలీవుడ్ స్టార్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో అమీర్‌ఖాన్ హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రివ్యూ షోకు అమీర్‌ఖాన్, చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సినిమా వీక్షించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య చాలా బాగా నటించారని ఆయన ప్రశంసించారు. ఇది అమీర్ కలల ప్రాజెక్టు అని.. ఈ సినిమాను వీక్షించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ తెలియజేశారు.
Fascinating how a chance meeting & a little chat with my dear friend #AamirKhan @Kyoto airport – Japan, few years ago led to me becoming a part of his dream project #LaalSinghChaddha
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Thank You #AamirKhan for the exclusive preview at my home.Heartened by your warm warm gesture! pic.twitter.com/hQYVZ1UQ5m
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022
అయితే లాల్‌సింగ్ చద్దా మూవీ తెలుగు వెర్షన్‌లో కూడా విడుదలవుతోంది. తెలుగు వెర్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యహరిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తన సన్నిహిత మిత్రుడు అమీర్ ఖాన్ నటించిన ఎమోషనల్ చిత్రం తెలుగు వెర్షన్‌ను సమర్పించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చిరు అభిప్రాయపడ్డారు. అమీర్‌ను మరోసారి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని పేర్కొన్నారు. కాగా పలు ఆస్కార్ అవార్డులు గెలిచిన హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా చిత్రంపై అమీర్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్, ఆర్యా శర్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో కలిసి వయాకామ్18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Feel very privileged to present the Telugu version of my dear friend #AamirKhan ‘s wonderful emotional roller coaster #LaalSinghChaddha
Our Telugu audiences are surely going to love him ! pic.twitter.com/Tb2apAaJrz
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!