Asia Cup: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లో బుధవారం నాడు హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్ టీమిండియానే అయినా హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే అవుతుంది. గ్రూప్-బిలో ఆప్ఘనిస్తాన్ అదరగొట్టే రీతిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. అదే విధంగా గ్రూప్-ఎలో హాంకాంగ్ సంచలనాలు నమోదు చేయాలని ఆరాటపడుతోంది. గతంలో ఆసియా కప్‌లో 2008లో, 2018లో హాంకాంగ్‌తో ఇండియా తలపడింది. […]
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న 62.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1,594.66 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలోని 2.66 లక్షల మంది వలంటీర్లు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఐదు రోజుల్లోగా వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పింఛన్ల అందజేతలో అక్రమాలకు తావులేకుండా అధికారులు బయోమెట్రిక్, ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాగా అర్హులైన ప్రతి ఒక్కరికీ […]
Train Accident: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పరిధి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ రైలు గేటు వేసి ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా రైలు గేటు దాటుతుంటారు. ఈ మేరకు ఓ వ్యక్తి ఓ ట్రాక్‌పై రైలు వెళ్తున్నా.. మరో ట్రాక్‌పై నుంచి రోడ్డు దాటేందుకు […]
Chandra Babu: ఏపీలో వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. వినాయక చవితి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదని చంద్రబాబు పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రజలను ఏకం చేసి.. వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్ఫూర్తి అని.. అటువంటి గణేష్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని ఈ సందర్భంగా […]
Ganesh Chaturthi: సకల దేవతలకు గణపతి దేవుడు గణ నాయకడు. అందుకే ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా గణపతిని పూజిస్తుంటారు. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టి రచనకు ముందుగా గణపతిని పూజించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటి వినాయకుడి పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు. సాధారణంగా వినాయకచవితిని చాంద్రమానంలోని ఆరో నెలలో జరుపుకుంటాం. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు వేర్వేరు కోణాల్లో ఉంటారు. కాబట్టి భూమిపై […]
Ganesh Chaturthi: వినాయక చవితి సందర్భంగా పలువురు రకరకాల డిజైన్‌లలో గణేష్ ప్రతిమలను తయారు చేస్తున్నారు. గతంలో గబ్బర్‌సింగ్, RRR, బాహుబలి, స్పైడర్‌మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో విక్రయానికి వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ స్టైలులో ఉన్న వినాయకుడు కూడా మార్కెట్లోకి వచ్చేశాడు. పుష్పలో సూపర్‌హిట్ డైలాగ్ ‘తగ్గేదే లే’ స్టిల్‌లో ఈ వినాయకుడిని తయారు చేయగా ఈ గణేష్ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ […]
Andhra Pradesh: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ దేశవాళీ అవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కృత్రిమ గర్భధారణ పద్దతుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సేవ్ దేశీ కౌస్ ప్రచారంలో భాగంగా ఆమె సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. అంతేకాకుండా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం […]
Yellow Crazy Ants: చీమే కదా అని తక్కువ అంచనా వేయకండి. సైజులో చిన్నగా ఉన్నా చీమ కుడితే ఎంతటి ప్రాణి అయినా గిలగిల కొట్టుకోవాల్సిందే. చీమలు లక్షల సంఖ్యలో దండయాత్ర చేస్తే ప్రజలు వణికిపోవాల్సిందే. తమిళనాడులోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి గ్రామాలపై చీమలు దండెత్తాయి. గ్రామాల్లోకి చొచ్చుకొస్తున్న చీమల దండు కనిపించిన ప్రతి వస్తువును తినేస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు. […]
Somu Veerraju: ఏపీలో వినాయక చవితి పండగ సందర్భంగా ఆంక్షలు విధించారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు యావత్ ఆంధ్ర ప్రదేశ్ నివ్వెరపోయేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం వినాయక చవితికి పందిరి వేసుకుంటే ఫైర్, విద్యుత్, పోలీసుల పర్మిషన్ కావాలని.. చందాలు అడగాలన్నా పర్మిషన్ కావాలని, అసలు ఈ ప్రభుత్వం మనలో పుట్టిందా లేదా అమెరికా నుంచి ఏమైనా […]