Somu Veerraju: ఏపీలోని కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఐఎఫ్‌సీఐ (ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు […]
Vidadala Rajini: ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి విడదల రజినీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెప్టెంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అన్ని స్థాయిల సిబ్బందికి ప్రత్యేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హులైన ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చూడాలని, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి విడదల రజినీ ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆయుష్ […]
IND Vs HKG: ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ (21) నిరాశపరచగా.. ఫామ్‌తో తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ (36) నత్తనడకన బ్యాటింగ్ చేశాడు. దీంతో పసికూన హాంకాంగ్‌పై టీమిండియా ఎంత స్కోరు చేస్తుందనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ రేపింది. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన విరాట్ […]
Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. ఆదివారం నాడు దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు భారత్, పాకిస్థాన్ జట్లు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దీంతో రెండు జట్లు జరిమానా బారిన పడ్డాయి. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల […]
Viral Video: సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు కొంచెం ఫన్‌గా ఉంటే చాలు నెటిజన్‌లు తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఓ బైక్‌పై ఏడుగురు వెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా ఒక బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా ఎదుర్కోక తప్పదు. అలాంటిది ఒకే బైకుపై ఏడుగురు వెళ్లడం అంటే మాములు మాటలు కాదు. దీంతో నెటిజన్‌లు ఈ వీడియో చూసి ఇది బైక్ కాదని.. […]
IND Vs HKG: దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు చేసింది. పాకిస్థాన్‌తో టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో కీపర్ రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంది. రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాండ్యా తమకు చాలా కీలక ఆటగాడు అని.. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా స్థానంలో పంత్ ఆడతాడని చెప్పాడు. […]
CM Jagan: సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరనున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల […]
New Zealand: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ (36) బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌కు ఇన్నాళ్లపాటు ఆడే అవకాశం లభించడం తన అదృష్టమని గ్రాండ్‌హోమ్ చెప్పాడు. వయసు పెరిగిన తన శరీరానికి శిక్షణ తీసుకోవడం కష్టమవుతుందని.. గాయాలు వేధిస్తున్నాయని అందువల్ల తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. జింబాబ్వేలో పుట్టిన గ్రాండ్ హోమ్ 2004లో అండర్-19 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే తరఫున ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌కు మకాం మార్చి […]
AP Crime News: భార్యకు టిఫిన్ తీసుకువచ్చేందుకు వెళ్లిన భర్త దాదాపు 45 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చే సమయానికి గుర్తు తెలియని వ్యక్తి ఇంటి నుంచి పరారవుతున్నాడు. భయాందోళనలతో ఏం జరిగిందో ఇంట్లోకి వెళ్లి చూడటంతో రక్తపు మడుగులో మృతి చెంది పడి ఉన్న భార్య కనపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు భర్త. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన దోపిడీ ఘటనతో పట్టణమంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. మహిళ హత్య కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్‌ను […]
Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు […]