Viral Video: ఇది బైక్ కాదు.. మినీ వ్యాన్.. ఒకే బైకుపై ఏడుగురు ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు కొంచెం ఫన్‌గా ఉంటే చాలు నెటిజన్‌లు తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఓ బైక్‌పై ఏడుగురు వెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా ఒక బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా ఎదుర్కోక తప్పదు. అలాంటిది ఒకే బైకుపై ఏడుగురు వెళ్లడం అంటే మాములు మాటలు కాదు. దీంతో నెటిజన్‌లు ఈ వీడియో చూసి ఇది బైక్ కాదని.. మినీ వ్యాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే బైక్‌పై వెళ్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ముందుగా ఒక వ్యక్తి బైక్‌పై కూర్చోగా.. ఇద్దరు పిల్లలు ఆయన ముందున్న పెట్రోల్ ట్యాంకుపై కూర్చున్నారు. అప్పటికే మరో ఇద్దరు పిల్లలు సహా ఇద్దరు మహిళలు బైక్ పక్కన ఎదురు చూస్తున్నారు. అనంతరం ఒక మహిళ బైక్ ఎక్కింది. ఆమెకు ఒక చిన్నారిని అందించిన మరో మహిళ.. తన చంకలో మరో చిన్నారిని ఎత్తుకుని ఆమె కూడా బైక్ ఎక్కింది. ఇలా బైక్‌పై ఏకంగా ఏడుగురు ఎక్కారు. వీరిలో ఏ ఒక్కరికీ కూడా హెల్మెట్ కూడా లేకపోవడం మరో గమనించాల్సిన విషయం.
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్గా మార్చే సింపుల్ టిప్స్.!
బైక్‌పై ఏడుగురు వెళ్తున్న వీడియో చూసిన నెటిజన్‌లలో కొందరు ‘ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది’ అంటూ మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా బైక్‌పై ప్రయాణిస్తారంటూ కొందరు నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బస్ టిక్కెట్లు, రైలు టిక్కెట్లతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు ఇష్టానుసారం పెంచితే సామాన్యులు ఇలాగే ప్రయాణిస్తారని కొందరు కౌంటర్లు వేస్తున్నారు. కాగా ఈ వీడియోను సుప్రియ సాహు అనే ఐఏఎస్ సోషల్ మీడియలో ‘స్పీచ్ లెస్’ అంటూ పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో అన్న విషయం మాత్రం తెలియరాలేదు.
Speechless 😶 pic.twitter.com/O86UZTn4at
— Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?