AP Crime News: భర్త టిఫిన్ తెచ్చేలోపు భార్య మృతి.. అసలు ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime News: భార్యకు టిఫిన్ తీసుకువచ్చేందుకు వెళ్లిన భర్త దాదాపు 45 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చే సమయానికి గుర్తు తెలియని వ్యక్తి ఇంటి నుంచి పరారవుతున్నాడు. భయాందోళనలతో ఏం జరిగిందో ఇంట్లోకి వెళ్లి చూడటంతో రక్తపు మడుగులో మృతి చెంది పడి ఉన్న భార్య కనపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు భర్త. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన దోపిడీ ఘటనతో పట్టణమంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. మహిళ హత్య కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్‌ను గుర్తించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా బ్లూ కలర్ లుంగీ, తెలుపు రంగు చొక్కాతో నిందితుడు పరారవుతున్నట్లు గుర్తించిన పోలీసులు మహిళను హత్చ చేసి బంగారు ఆభరణాలతో నిందితుడు పరారైనట్లు నిర్ధారించారు. ఇటీవల నెల్లూరు, చీరాలలో జరిగిన హత్యలు ఒకేలా ఉండటంతో పోలీసు శాఖకు సవాలుగా మారటంతో పాటు మళ్లీ హంతకముఠాలు ఇక్కడ ప్రవేశించాయా అన్న అనుమానాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
చీరాల భావనరుషిపేటలోని ఓ ఇంట్లో ఊట్ల మదన గోపాలమూర్తి, విజయలక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తుండటంతో వీరిద్దరే అక్కడ ఉంటున్నారు. గోపాలమూర్తి చిన్నపాటి వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం భర్త మదన గోపాలమూర్తి తన భార్య విజయ లక్ష్మీకి టిఫిన్ తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఇంటిలోకి ప్రవేశించి విజయలక్ష్మీని హతమార్చాడు. మృతురాలి ఒంటిపై ఉన్న సుమారు 11 సవర్ల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను అపహరించాడు. భార్యకు టిఫిన్ తీసుకు వచ్చేందుకు వెళ్లిన భర్త దాదాపు 45 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చే సమయానికి గుర్తు తెలియని వ్యక్తి భర్తను గమనించి పక్క ఇంటి మీదకు దూకి అటునుండి పరారయ్యాడు. భయాందోళనలతో ఏం జరిగిందో ఇంట్లోకి వెళ్లి చూడటంతో రక్తపు మడుగులో మృతి చెంది పడి ఉన్న భార్య కనపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్దలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన సెంటర్ లోని ఇంట్లో సాయంత్రం సమయంలో ఓ దొంగ భీభత్సం సృష్టించి ఓ వివాహిత దారుణంగా హత్య చేసి నగలు దొంగిలించుకుపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హత్య జరిగిన ప్రాంతం నుండి ప్రధాన రహాదారుల్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయినా పుటేజ్ ఆధారంగా నిందితుడి ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు బ్లూ షర్ట్, తెల్ల పంచె కట్టుకున్నవ్యక్తిని నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
అయితే ఇటీవల నెల్లూరులో జరిగిన హత్యలు.. చీరాలలో జరిగిన సంఘటన ఒకేలా కనిపిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది.. దోపిడీలకు పాల్పడి హత్యలు చేసే నరహంతక ముఠాలు ప్రవేశించాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీరాల హత్య కేసులో సీసీఫుటేజీ ఆధారంగా ఒకరిని పోలీసులు గుర్తించగా నెల్లూరులో భార్యాభర్తల హత్య కేసులో ఇంతవరకు దర్యాప్తు కొలిక్కిరాలేదు. గతంలో చీమకుర్తిలో భార్యాభర్తలు ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ ఘటనలో హత్యకు గురైన మహిళ ఒంటిపై నగలు ఆ ఇంట్లోని నగలు మాత్రమే అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత గతేడాది డిసెంబరు టంగుటూరులో ఇంట్లో ఉన్న మహిళను ఆమె కుమార్తెలు హత్యకు గురయ్యారు. ఆ ఇంట్లో కూడా అందుబాటులో ఉన్న నగలు మాత్రమే అపహరణకు గురయ్యాయి. ఇలాంటి సంఘటనే ఇంకొల్లు మండలం పూసపాడులో చోటుచేసుకుంది. అప్పట్లో ఘటనలు పోలీసు శాఖ పనితీరుపై సవాలుగా మారటంతో సీరియస్ దృష్టి సారించిన పోలీసులు చీరాల, టంగుటూరు హత్య కేసుల్లో నిందితులను పట్టుకున్నారు.. అయితే ఆ ఇద్దరు జిల్లాకు చెందిన చిన్నా చితక దొంగలు కావటంతో పోలీసు శాఖపై పలు విమర్శలు వినిపించాయి. అయితే టంగుటూరు, చీమకుర్తి హత్యలకు నార్త్ ఇండియాకు చెందిన పేరు మోసిన దొంగలే కారణమని భావించిన పోలీసులు ఆ కోణంలో విచారణ కూడా నిర్వహించారు. చివరకు జరుగుమల్లి, చీమకుర్తి ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకొల్లు వృద్ధ దంపతుల హత్యకేసు కొలిక్కి రాలేదు.
గతంలో చీరాలలో రెండు హత్యా సంఘటనలు ఇదే తరహాలో జరిగాయి. నెల్లూరు, చీరాలలో జరిగిన కేసులు దోపిడీ దొంగల పనే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రజలు మరోసారి తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ప్రజల ఆందోళనల కన్నా పోలీసు యంత్రాంగం దర్యాప్తు సమర్థతకు ఈ ఘటనలు సవాలు మారుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కేసుపై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. సంఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలను పాత నేరస్థుల వేలిముద్రలతో సరిపోతాయో, లేదోనని పరిశీలిస్తున్నామన్నారు. సీసీ కెమెరాలో నమోదైన నిందితుడి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!