Election Survey: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఆమ్‌ఆద్మీ కూడా పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ మేరకు గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కమలం పార్టీనే విజయం సాధిస్తుందని సర్వే రిపోర్టుల్లో […]
Adipurush: రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ఆదిపురుష్. పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రకటన వచ్చిన నాటి నుంచి అభిమానులు రికార్డుల గురించే ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పౌరాణిక సినిమాలన్నీ భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుండటంతో ఆదిపురుష్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. గత రెండు చిత్రాలు సాహో, రాధేశ్యామ్ సినిమాలు తీర్చలేని ఆకలిని ఆదిపురుష్ తీరుస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా అయోధ్యలో ఆదిపురుష్ […]
Navaratri Special: సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్తే భక్తులు ఆలయం బయటే చెప్పులు విడిచి లోపలకు వెళ్తారు. ఇది సంప్రదాయం కూడా. అలాంటిది దేవుడికి చెప్పులు సమర్పించడం ఎక్కడైనా చూస్తామా.. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాత్రం ఈ సన్నివేశం కనిపిస్తుంది. భోపాల్‌లోని కోలా ప్రాంతంలో జిజిబాయ్ ఆలయం, పహడావాలీ మాతా ఆలయానికి వెళ్లే భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చెప్పులు, షూలు సమర్పించి తమ కష్టాలు చెప్పుకుంటారు. దీనికి ఓ కారణముందని అక్కడి స్థానికులు వివరిస్తున్నారు. […]
Tollywood: ఈ ఏడాదిలో ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే దసరాకు వచ్చే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటు రవితేజ ‘ధమాకా’ను పక్కనబెడితే మరో పెద్ద సినిమా కనిపించడం లేదు. టాలీవుడ్‌లో వచ్చే మూడు నెలల పాటు అన్ని కుర్రహీరోల సినిమాలే విడుదల కానున్నాయి. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో సంక్రాంతి వరకు కుర్ర […]
Rohit Sharma: టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. టీ20 ప్రపంచకప్ ముంగిట రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ హుడా గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తం కారడం టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్లో ఆందోళన కలిగించింది. రోహిత్ దగ్గరకు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వచ్చి కర్చీఫ్ అందించి ఏమైందో అడిగి తెలుసుకున్నాడు. […]
What’s Today: • తిరుమల: నేడు 7వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు ఉ.8 గంటలకు సూర్యప్రభ వాహనంపై విహరించనున్న శ్రీవారు.. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు • నేడు శ్రీశైలంలో 8వ రోజు దసరా మహోత్సవాలు.. సాయంత్రం మహాగౌరి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. నందివాహనంపై పూజలందుకోనున్న ఆదిదంపతులు.. రాత్రి క్షేత్ర […]
IND Vs SA: గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారీ స్కోరు చేయడంతో టీమిండియా బతికిపోయింది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ విజయపు అంచుల వరకు తీసుకువెళ్లాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 16 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే […]
IND Vs SA: ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లను తప్పించారు. ఈ మేరకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్-ఎతో […]
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ పాల్గొంటాడని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఇప్పటికే ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. […]
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పరుగులు పోటెత్తాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బలమైన పునాది వేయగా.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ విధ్వంసం సృష్టించారు. చివర్లో దినేష్ కార్తీక్ కూడా తనదైన చేయి వేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, […]