Talasani Srinivas Yadav: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న గోపాలమిత్రలకు దసరాకు ఒకరోజు ముందే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీపికబురు అందించారు. ప్రస్తుతం గోపాల మిత్రలకు నెలకు రూ.8,500 చెల్లిస్తుండగా.. 30శాతం జీతం పెంచనున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం అంటే రూ.2,550 పెంచి మొత్తం రూ.11,050 ఇస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడమే కాకుండా […]
IND Vs SA: ఇండోర్‌లో టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ మరోసారి రాణించాడు. అతడు 43 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోసౌ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో […]
Somu Veerraju: విశాఖలోని దసపల్లా భూముల అన్యాక్రంతంపై సీఎం జగన్‌కు మంగళవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. విశాఖ నగరంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని లేఖలో కోరారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం […]
New Idea: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడటం సాధారణ విషయమే. వర్షం వస్తే ఇంటా, బయట ఏ పని పూర్తి కాదు. వర్షాలు, తుఫాన్లు వస్తున్నా అత్యవసర రంగాలకు చెందిన ఉద్యోగులు పలు జాగ్రత్తలతో పనిచేయాల్సి ఉంటుంది. తుఫాన్ కారణంగా అమెరికాలోని ఫ్లోరిడా నగరం అల్లకల్లోలంగా మారింది. నాలుగు రోజులుగా ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా జోరు వానలో, భీకర గాలిలోనూ అక్కడి పరిస్థితులను వివరించేందుకు కైలా అనే మహిళా రిపోర్టర్ […]
బాలయ్య మరోసారి ఓటీటీ వేదికగా సందడి చేయబోతున్నారు. ఆయన అభిమానుల కోరిక మేరకు అన్ స్టాపబుల్ సీజన్ 2ను ఆహా ఓటీటీ త్వరలో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ సందర్భంగా విజయవాడలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. https://www.youtube.com/watch?v=UmrvqUz1x18
IND Vs SA: ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఏకంగా మూడు మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. వీరి స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఉమేష్ యాదవ్‌లకు చోటు కల్పించింది. అటు యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పక్కనబెట్టి అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంది. […]
Andhra Pradesh: ఇటీవల శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు రాంనగర్ కాలనీకి చేరుకున్న ఆమె నిందితుడి భార్య పట్ల శారీరకంగా దాడి చేశారు. అతడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ హింసించారు. సదరు మహిళను దూషిస్తూ బలవంతంగా పోలీస్ వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. తనను సీఐ అంజు యాదవ్ తన్నారంటూ ధనలక్ష్మీ అనే మహిళ ఆరోపించింది. అంతేకాకుండా మహిళను కాలితో తన్నుతూ చీర లాగి, […]
Roja Selvamani: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా తణుకులో జరిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఎడ్లబండిని తోలుతూ ఉత్సాహంగా కనిపించారు. ఆమె ఎడ్లబండిని తోలిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. […]
Chintamaneni Prabhakar: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర తాడేపల్లి గూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. అమరావతి టు అరసవెల్లి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫేక్ రైతులు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే ఈ ఫ్లెక్సీలను స్థానిక మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏర్పాటు చేయించారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవగాహన లేమితో రాజధానిపై మూడు […]
KVP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. కర్ణాటక సరిహద్దు మోక వద్ద ఏపీలో ప్రారంభం కానుంది. ఏపీలో నాలుగు రోజుల పాటు 90 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్ జోడో యాత్ర నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ […]