Rohit Sharma: టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. టీ20 ప్రపంచకప్ ముంగిట రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ హుడా గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తం కారడం టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్లో ఆందోళన కలిగించింది. రోహిత్ దగ్గరకు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వచ్చి కర్చీఫ్ అందించి ఏమైందో అడిగి తెలుసుకున్నాడు. రోహిత్ టీషర్టుపై కొన్ని రక్తం చుక్కలు పడ్డాయి. అయినప్పటికీ హర్షల్ పటేల్‌కు రోహిత్ సూచనలు చేయడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రక్తం ఆగకపోవడంతో రోహిత్ శర్మ మైదానాన్ని వీడి, చికిత్స చేయించుకుని వచ్చాడు. అయితే డీహైడ్రేషన్ వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: IND Vs SA: డేవిడ్ మిల్లర్ సెంచరీ.. అయినా టీమిండియాదే గెలుపు.. సిరీస్ కూడా..!!
మరోవైపు బ్యాటింగ్ సమయంలోనూ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో దక్షిణాఫ్రికా బౌలర్ పార్నెల్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ మణికట్టుకు గాయమైంది. పార్నెల్ వేసిన మూడో బంతిని రోహిత్ స్కూప్ షాట్‌తో బౌండరీకి తరలించాడు. అయితే ఈ షాట్ ఆడే క్రమంలో బంతి అతని గ్లౌవ్స్ తాకి కీపర్ పక్క నుంచి బౌండరీకి వెళ్లింది. అయితే రోహిత్ నొప్పితో విలవిలలాడాడు. అతని ఎడమ మణికట్టుకు బంతి బలంగా తాకినట్లు అనిపించింది. మైదానంలోకి వచ్చిన ఫిజియో.. ప్రథమ చికిత్స చేయడంతో రోహిత్ తన ఆటను కొనసాగించాడు. పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆటను కొనసాగించిన రోహిత్.. కాస్త అసౌకర్యంగానే కనిపించాడు. దాంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
Read Also: IND Vs SA: లైవ్ మ్యాచ్‌లో విశేష అతిథి.. వణికిపోయిన క్రికెట్ అభిమానులు