Adipurush: రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ఆదిపురుష్. పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రకటన వచ్చిన నాటి నుంచి అభిమానులు రికార్డుల గురించే ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పౌరాణిక సినిమాలన్నీ భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుండటంతో ఆదిపురుష్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. గత రెండు చిత్రాలు సాహో, రాధేశ్యామ్ సినిమాలు తీర్చలేని ఆకలిని ఆదిపురుష్ తీరుస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా అయోధ్యలో ఆదిపురుష్ టీజర్‌ను భారీస్థాయిలో ఈవెంట్ నిర్వహించి విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్‌పై కామన్ ఆడియన్స్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది.
Read Also: Tollywood: రానున్న మూడు నెలలు కుర్రహీరోలదే జోరు..!!
ఆదిపురుష్ టీజర్ యానిమేటెడ్‌లా ఉందని, వీఎఫ్ఎక్స్ బాగోలేదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఇది నార్మల్ సినిమానా, బొమ్మల సినిమానా అని చాలామంది సందేహపడుతున్నారు. ఆదిపురుష్ టీజర్ అచ్చం రజనీకాంత్ కొచ్చాడియాన్ సినిమాలా ఉందని.. మరి సినిమా కూడా ఇలాగే ఉంటే కష్టమని అభిప్రాయపడుతున్నారు. అటు ప్రభాస్ లుక్ కూడా అంతలా నచ్చలేదని అసంతృప్తి చెందుతున్నారు. ఈ టీజర్‌లో రెండే రెండు పాజిటివ్ అంశాలు ఉన్నాయని.. ఒకటి బీజీఎం అయితే రెండోది డైలాగులు అని అభిమానులు చెప్తున్నారు. మరి ఆదిపురుష్ ఫుల్ యానిమేటెడ్ మూవీనా లేదా సాధారణంగానే ఉంటుందా అనే విషయంపై మేకర్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా ఆదిపురుష్ మూవీకి హిందీ డబ్బింగ్ ప్రభాస్ చెప్పలేదని తెలుస్తోంది. నటుడు శరద్ కేల్కర్ ఆదిపురుష్‌లో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట. గతంలో బాహుబలి సినిమా సమయంలో కూడా హిందీలో ప్రభాస్ పాత్రకు శరద్ కేల్కర్ వాయిస్ అందించారు.