అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే, దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో చెప్పారు. ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్-శ్రీలంక మధ్య రోడ్డు మార్గం నిర్మించేందుకు ముమ్మర కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం రెండు దేశాల మధ్య జల మరియు వాయు మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే, భారత్-శ్రీలంక మధ్య భూ అనుసంధానం కోసం చేస్తున్న అధ్యయనం తుది దశకు చేరుకుందని శ్రీలంక తాజాగా తెలిపింది.
NEET UG 2024 Paper Leak: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నీట్ పేపర్ లీక్‌పై వస్తోన్న ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు అక్కడి ఆర్ధిక నేరాల విభాగం (EOU) వెల్లడించింది. వీరి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ చేసినందుకు.. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో […]
David Wiese Announced His Retirement From International Cricket: నమీబియా క్రికెటర్ ఆల్ రౌండర్ డేవిడ్ వైస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఓటమి అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. 39 ఏళ్ల డేవిడ్ తన అంతర్జాతీయ కెరీర్లో 15 వన్డేలు, 53 టీ20ల్లో 927 పరుగులు, 73 వికెట్లు తీశారు. తన చివరి మ్యాచులో పొదుపుగా బౌలింగ్ […]
Anna Canteens in AP : ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఓవైపు శాఖలవారీగా ప్రక్షాళన చేస్తూనే… మరోవైపు కీలక పథకాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి.. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మరిన్ని […]
Vegetable Prices: సహజంగా వేసవికాలం రాగానే కూరగాయల ధరలు పెరుగుతాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే ధరలు కాస్త తగ్గుతాయి. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ఎండాకాలం ధరలు నామమాత్రంగా పెరిగి, వర్షాకాలం మొదట్లో ధరలు అమాంతం చుక్కలను తాకుతున్నాయి. ఉల్లిపాయల నుంచి కూరగాయల వరకు అన్ని ధరలు పెరగడంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా తయారయింది. ఇక పప్పు దినుసులు రేట్లు కూడా అమాంతంగా పెంచేశారు. ఇక పెరిగిన రేట్లు తెలిసికోవాలంటే కింది వీడియో చుడాలిసిందే…
హోం మంత్రి అనిత రాష్ట్రంలో డ్రగ్ వినియోగం, మహిళలపై అత్యాచారాలు పెరుగుతోందని, ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ విషయంలో ప్రణాళికగ వేవహరిస్తాం అన్ని తెలిపారు . డ్రగ్ సంబంధిత కేసులపై సమీక్ష జరుపుతామని పోలీసులతో తీసుకోవాల్సిన చెరియలపై కసరత్తు చేస్తాం అన్నారు . కోనసింహ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, మంచి ఫలితాల కోసం ఆశీస్సులు పొందారు. డ్రగ్ దుర్వినియోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పోలీసులతో కలిసి పనిచేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని పట్టపగలు కొట్టి చంపిన దారుణ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, ఎవరైనా వ్యక్తులు లేదా గ్రూపులు భౌతిక దాడులు లేదా హత్యలకు పాల్పడితే, వారి స్థితి లేదా సంబంధాలతో సంబంధం లేకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రజల భద్రతకు […]
గిరిజన గ్రామాల్లో గర్భిణులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరకయాతన పడుతున్నారు. పురిటి నొప్పులు వస్తే గర్భిణిని డోలీలో మోసుకెళ్లాల్సిందే. అల్లూరి జిల్లా అరకులోయ ఏజెన్సీలో గిరిజన గ్రామానికి చెందిన గర్భిణికి నొప్పులు రావడంతో డోలీ కట్టి కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వచ్చారు. మార్గ మధ్య లో 108అంబులెన్స్ రావడం తో ఎక్కించారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది అన్ని తెలిపారు.
ఉత్తరాది రాష్ట్రాలలో భానుడు భగభగమంటున్నాడు. వడగాల్పులతో ఉత్తర భారతమంతా వేడెక్కుతోంది. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వేడి తీవ్రతతో అవస్థలుపడుతున్నారు. యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ నెల 17 వరకు వేడిగాలుల ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర, నాసిక్, రాజస్థాన్ మరియు ఢిల్లీ వంటి ప్రాంతాలు ముఖ్యంగా ప్రభావితమయ్యాయి, ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. బావులు ఎండిపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. కొన్ని […]