సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నిన్న సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చేలా, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి దస్త్రాలపై సంతకాలు చేసారు. మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో ని చూడండి…
రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు వివిధ శాఖలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ సమావేశాల్లో విద్య, వ్యవసాయ కమిషన్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్ఓఆర్ చట్టాలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. రానున్న శాసనమండలి వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. పలు అంశాలపై ఎమ్మెల్సీలకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీ బలం పుంజుకోవడంతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.
మాదాపూర్‌లోని మోషే పబ్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒ యువతి ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను చీట్ చేసింది. ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల ప్రకారం, మోషే పబ్‌లో జరిగిన అక్రమాల గురించి.. “తక్షణ అనే యువతి ముగ్గురు వ్యాపారవేత్తలకు టోకరా వేసింది. మోషే పబ్ మేనేజర్, యజమానితో కలిసి వారిని చీట్ చేసింది. పబ్‌లో లిక్కర్ తాగినట్టుగా నటించి ఏకంగా వేల రూపాయల బిల్లు వేయించింది. అనంతరం, ప్లాన్ ప్రకారం […]
భారతదేశంలో ఆంధ్రరాష్ట్రం అత్యున్నత స్థానంలో ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో.. సృష్టించిన సంపద ప్రతి పేదవాడికి చేరవేయాలన్న సంకల్పంకూడా అంతే ముఖ్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక పై ఎన్డీయే కూటమి పేదరికం లేని దేశం తద్వారా పేదరికం లేని రాష్ట్రాన్ని తీసుకురావాలన్న స్పూర్తితో పని చేస్తుంది అన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని ఇక్కడ పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. ఇకపై తిరుమల […]
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు.కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని.. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
Disha Patani : దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ప్రభాస్ కల్కి, సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, […]