గ్రామ దేవత ఊరేగింపు వేడుకలో విషాదం చోటుచేసుకుంది. సిరిమాను విరిగి పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరొక ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.కుప్పిలి గ్రామంలో గ్రామ దేవత ఊరేగింపు వేడుకలు జరుగుతుండగా, పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరై సందడి నెలకొల్పారు. ఈ క్రమంలో సిరిమాను ఒక్కసారిగా విరిగి కిందపడటంతో, బుడగట్లపాలెంకు చెందిన కారి పల్లేటి (50) మరియు అప్పన్న (40) అక్కడికక్కడే మృతి చెందారు. […]
Mirzapur Season 3: ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ నుంచి సీజన్ 3 త్వరలోనే స్ట్రీమింగ్ కి రానుంది. ఈ క్రైమ్ ఇంటెన్స్ డ్రామా సిరీస్‌లో తొలి రెండు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. మీర్జాపూర్ ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు, ప్రతీకారాలు, హింసతో రెండు సీజన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు, మీర్జాపూర్ మూడో సీజన్ వచ్చేస్తోంది. జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ తరుణంలో […]
Andhra Pradesh Volunteers: అకస్మాత్తుగా సమావేశమన్నారు. వెళ్లేసరికి రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు. వాళ్ల ముందే రాజీనామా చేయాలని ఆదేశించారు’ అన్నమయ్య జిల్లా పీలేరులో మొత్తం 160 మంది వాలంటీర్లను రాజీనామా చేయించారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు బెదిరింపు రాజకీయాలు చేశారు. వాలంటీర్లతో ఎన్నికలకు ముందు బలవంతంగా రాజీనామాలు చేయించి ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. వచ్చేది వైకాపా […]
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి రెండ్రోజులపాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తొలిసారి ఆయన పులివెందులకు వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నాం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నాం కల్లా పులివెందుల పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారాయన.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచారు. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల పనులు శరవేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను ఈ విధంగ , అచ్చెన్నాయుడు మాట్లాడడం చర్చనీయాంశమౌతోంది. ఆయన ఎం వ్యాఖ్యలు చేసారో తెలుసుకోవడం కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..
బీటెక్ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం ఆదోని పట్టణంలో వెలుగు చూసింది. రైల్వే పోలీసులు, విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు, నలినీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు సలేంద్ర ఈశ్వర్ (20) సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో ఈశ్వర్ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడన్నారు. రాత్రి […]
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఓ పెద్దపులి కారుపై దాడి చేసింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతింది, కానీ అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. కడప జిల్లా గోపవరం మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి నెల్లూరులోని కళాశాలలో చేరేందుకు కారులో బయలుదేరారు. కారు కదిరినాయుడుపల్లి సమీపానికి వచ్చేసరికి పెద్దపులి దాడి చేసింది. కారుకు ఎదురుపడిన పులి రోడ్డుపై కొంత […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులకు శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి 17వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 9.26 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్లకు పైగా నగదు బదిలీ చేయనున్నారు. వారణాసి నుంచి రిమోట్ బటన్ నొక్కడం ద్వారా ఈ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లో అన్నదాతలకు సాయం చేసేందుకు పీఎం […]
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంల) వినియోగంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హ్యాకింగ్ నివారణకు ఈవీఎంలను తొలగించాలని ఆయన పేర్కొన్నారు. ప్యూర్టో రికోలో ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలపై మస్క్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ వ్యాఖ్యలతో భారతదేశంలో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మస్క్‌ను భారత్‌కి ఆహ్వానించి, ఈవీఎంల హ్యాకింగ్ నిరూపించేందుకు అవకాశం ఇవ్వాలని సవాలు చేశారు మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో […]
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 19వ తేదీ బుధవారం రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే పొలిటికల్ గా అంతకంతకూ బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతారని కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి […]