అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే, దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో చెప్పారు. ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.