గిరిజన గ్రామాల్లో గర్భిణులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరకయాతన పడుతున్నారు. పురిటి నొప్పులు వస్తే గర్భిణిని డోలీలో మోసుకెళ్లాల్సిందే. అల్లూరి జిల్లా అరకులోయ ఏజెన్సీలో గిరిజన గ్రామానికి చెందిన గర్భిణికి నొప్పులు రావడంతో డోలీ కట్టి కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వచ్చారు. మార్గ మధ్య లో 108అంబులెన్స్ రావడం తో ఎక్కించారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది అన్ని తెలిపారు.