హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా ఫుల్లు స్పీడుగా దూసుకెళ్తోంది. పేరుకు మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు సినిమాల్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. తద్వారా టాలీవుడ్‌కు మళ్లీ పూర్వపు వైభవాన్ని ఈ మూవీ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సాయిపల్లవి తన డ్యాన్సులతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఫిదా […]
బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బిగ్‌బాస్ షోతో అలరించిన తారక్.. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నాడు. సీజన్ 1కు సంబంధించి నిర్వాహకులు మొత్తం 60 ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 37 ఎపిసోడ్లు టీవీలో టెలీకాస్ట్ అయ్యాయి. మరో 23 షోలకు సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. సీజన్ 1 మొత్తానికి […]
(అక్టోబర్ 10న రేఖ పుట్టినరోజు) ఆరున్నర పదుల వయసు దాటినా, అందానికి అందం అన్నట్టుగా అలరిస్తోన్న రేఖ దక్షిణాదిలోనే నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఉత్తరాదిన అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. అనేక హిందీ చిత్రాలలో రేఖ అందాలతో విందు చేస్తూ జనం మదిలో చెరగని ముద్ర వేశారు. ఈ నాటికీ నవతరం భామలకు దీటుగా వెలుగులు విరజిమ్ముతోన్న రేఖ అందాన్ని చూసి, ఆ నాటి ఆమె కథానాయకులు అబ్బుర పడుతూ ఉంటారు. జాతీయ స్థాయిలో ఉత్తమనటిగానూ నిలచిన రేఖ, […]
(అక్టోబర్ 10న ఆలీ పుట్టినరోజు) ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా, అదరక బెదరక ఇట్టే ఆకట్టుకొనే అభినయంతో అలరించే బాలలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నవ్వుల పువ్వులు పూయించే ఆలీ స్థానం ప్రత్యేకమైనది. పన్నెండేళ్ళ ప్రాయంలోనే నటనలోకి అడుగు పెట్టిన ఆలీ అప్పటి నుంచీ ఇప్పటి దాకా తన హాస్యంతో గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లోనూ ఆలీ నవ్వులు పూయిస్తున్నారు. వందలాది చిత్రాలలో ఆలీ అభినయం జనాన్ని ఆకట్టుకుంది. ఇప్పటికీ […]
(అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు) నాజుకు షోకులతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే అందం, చందం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం. రకుల్ నవ్వు, చూపు, రూపు, నడక, నడత అన్నీ ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. అందువల్లే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలంటే కుర్రాళ్ళకు ఎంతో మోజు. తెలుగు చిత్రాలతోనే రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ డమ్ లభించింది. న్యూ ఢిల్లీలో 1990 అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ ఓ పంజాబీ కుటుంబంలో […]
(అక్టోబర్ 10న ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు) ఆ నాడు దేశంలో అరాచకం అలుముకున్న వేళ ఛత్రపతి వీరోచిత పోరాటం చేసి, మళ్ళీ మన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించారు. అదే తీరున తెలుగు సినిమా ప్రాభవం తరిగిపోతున్న వేళ మరోమారు ప్రపంచ యవనికపై తెలుగు చిత్రాల వెలుగును ప్రసరింప చేసిన ఘనుడు దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లో తెరకెక్కిన ‘స్వర్గసీమ’, ‘మల్లీశ్వరి’, ‘పాతాళభైరవి’ వంటి చిత్రాలు ఎల్లలు దాటి ప్రదర్శితమై, తెలుగు చిత్రాల ఉనికిని చాటాయి. […]
(అక్టోబర్ 10న ‘తాండ్ర పాపారాయుడు’కు 35 ఏళ్ళు) రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై అనేక జనరంజకమైన చిత్రాలను తెరకెక్కించారు. సొంత సంస్థ నిర్మించిన చిత్రాలతోనే కృష్ణంరాజు స్టార్ డమ్ అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. “కృష్ణవేణి, భక్తకన్నప్ప, అమరదీపం, బొబ్బిలిబ్రహ్మన్న” వంటి చిత్రాలు నటునిగా కృష్ణంరాజును జనం మదిలో నిలిపాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్దేశకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’. ఈ చిత్రానికి కృష్ణంరాజు తమ్ముడు యు.వి. సూర్యనారాయణ రాజు […]
(అక్టోబర్ 8న మంచు లక్ష్మి బర్త్ డే) నటి, నిర్మాత, నిర్వహాకురాలుగా మంచు లక్ష్మి సాగిన తీరే వేరు. తెలుగు చిత్రసీమలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నటనలో అడుగుపెట్టిన అమ్మాయిలు చాలా కొద్దిమందే కనిపిస్తారు. వారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. తండ్రి మోహన్ బాబు తనదైన కంచుకంఠంతో విలక్షణమైన పాత్రల్లో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. అదే తీరున మంచు లక్ష్మి సైతం వరైటీ రోల్స్ తో నటనలో అలరించారు. మాతృభాష తెలుగులో నటించక […]
(అక్టోబర్ 8న నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్ జయంతి) నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్ తెలుగు చిత్రసీమ బుడి బుడి అడుగులు వేసే నాటి నుంచీ సినిమా రంగంలో ఉన్నారు. అనేక చిత్రాలలో హాస్యరసం కురిపించారు. కొన్నిట విలనీ పండించారు. తన నవ్వుతోనే ఇతరులను ఇట్టే ఆకట్టుకొనేవారు పేకేటి శివరామ్. అందుకే ఆ రోజుల్లో అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. మాతృభాష తెలుగులోనే కాదు, కన్నడ చిత్రసీమలోనూ పేకేటి శివరామ్ రాణించారు. పేకేటి శివరామ్ 1918 అక్టోబర్ […]