బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బిగ్‌బాస్ షోతో అలరించిన తారక్.. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నాడు. సీజన్ 1కు సంబంధించి నిర్వాహకులు మొత్తం 60 ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 37 ఎపిసోడ్లు టీవీలో టెలీకాస్ట్ అయ్యాయి. మరో 23 షోలకు సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. సీజన్ 1 మొత్తానికి తారక్ రూ.7.5 కోట్లను రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.
జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తోంది. సీజన్ 1 తొలి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరుకాగా అనంతరం దర్శకులు రాజమౌళి, కొరటాల శివ వచ్చారు. ఇటీవల దసరా పండగ సందర్భంగా హీరోయిన్ సమంత గెస్టుగా వచ్చి రూ.25 లక్షలను గెలుచుకుంది. త్వరలో ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తారక్ షోలో మెరవనున్నారు. అయితే ఏపీ, తెలంగాణ నుంచి ఎందరో సామాన్యులు ఈ షోకు వచ్చి పాల్గొంటుండగా ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కూడా రూ.కోటిని గెలుచుకోలేదు. త్వరలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో అయినా ఎవరైనా రూ.కోటి గెలుచుకుంటారేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.