శనివారం వీకెండ్ కావడంతో మూవీ లవర్స్ తో థియేటర్ల వద్ద సందడిగా కనిపించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు అందుబాటులోకి వస్తున్నప్పటికి బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని మూవీ ఆడియన్స్ చెప్తున్నారు. పెద్ద సినిమాలు లేకపోయినను.. ఆడుతున్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ రెండు వారాల్లో 8.30 కోట్ల షేర్ ను రాబట్టిందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం – […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అప్పిరెడ్డి ఫౌండేషన్, సోహిహెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలు శనివారం హైదరాబాద్ నగరంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. అప్పిరెడ్డి ఫౌండేషన్ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డితోపాటు, సోహి హెల్పింగ్ హ్యాండ్స్, మైక్ మూవీస్, మైక్ టీవీ సంస్థల ప్రతినిధులు చక్రధర్ రావు, రవి రెడ్డి, చరిత్, సంపత్, జగ్గూ పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను సందర్శించి అక్కడివారికి అన్నదానంతోపాటు పళ్లు ఫలహారాలు అందించారు. చిరంజీవి చిరకాలం ఆయురోరాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. […]
రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆకట్టుకొంది. నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మలిచాడు విజయ్ కనకమేడల.. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదివరకే విజయ్ కనకమేడల నరేట్ చేసిన స్టోరీకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు […]
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 6న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే చిత్రంగా కేవలం రెండు వారాల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్ కొత్తూరి మాట్లాడుతూ ”కోవిడ్ సెకండ్ వేవ్ […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22)ను పురస్కరించుకుని, శనివారం గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల రూపొందించనున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శ్రీదేవి శోభన్‌బాబు అనే పేరుతో రూపొందనున్న ఈ క్యూట్ లవ్‌స్టోరిలో యువ కథానాయకుడు సంతోష్ శోభన్, ‘జాను’ ఫేమ్ గౌరి జి. కిషన్ జంటగా నటిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ […]
ఇటీవలే ఓ నూతన వధువు బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసి ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఆమె డాన్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఎక్కువగా షేర్ అయింది. అయితే తాజాగా ఈ పాటకు ఓ నర్సు చేసిన డాన్స్ వీడియో వైరల్ అయింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్‌కి చెందిన నర్సు ఆస్పత్రి ప్రాంగణంలో ఈ డాన్స్ చేసింది. కాగా, ఆ నర్సు ఆస్పత్రిలో చేయడంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కలెక్టరు కూడా సీరియస్ […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు గత కొన్ని రోజుల నుండి సంబరాలు, సేవాకార్యక్రమాలు జరుపుతుంటే… తాజాగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఒకరోజు ముందు నుండే రావడం మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లూసిఫర్’ మూవీకి తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే పేరు పెట్టారు. రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ […]
యాభై సంవత్సరాల తెలుగు టెలివిజన్ చరిత్రలో మొదటిసారి గా ఆవిర్భవించిన తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం టెలివిజన్ ఫెడరేషన్ ఫౌండర్ రచయిత, దర్శక నిర్మాత నాగబాల సురేష్ అధ్యక్షతన తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని పాల్గొని, టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే సమయంలో తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోషియేషన్ సంఘాన్ని […]
సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్ మీడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే… సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజజీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత బయటపడింది. ఇంతలోనే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ‘ఒకసారి చేదు అనుభవం ఎదురైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డావా?’ అంటూ సుమంత్ కు ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నాడు. […]
కరోనా ప్యాండమిక్ లో ఎంతోమంది ఆపన్నులను ఆదుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచిమనసు చాటుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఎంతోమంది యుద్ధం కారణంగా నిరాశ్రయులైనారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ తనదైన రీతిలో స్పందించారు. తాలిబన్లతో పోరాటం సాగించిన ఆఫ్ఘన్ పట్టణాలలో జనజీవనం అతలాకుతలమైందని, అలాంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని సోనూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే అక్కడ నివాసమున్న ఎంతోమంది […]