వైవిధ్యంగా ‘మళ్ళీ మొదలైంది’ ఫస్ట్ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్ మీడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే… సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజజీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత బయటపడింది. ఇంతలోనే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ‘ఒకసారి చేదు అనుభవం ఎదురైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డావా?’ అంటూ సుమంత్ కు ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నాడు. ఆ వార్తకూ విపరీతమైన ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే… ఇదంతా పబ్లిసిటీలో భాగంగానే జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే… సుమంత్ ఎవరో కాదు… రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో పరిచయం చేసి హీరో! ఇక ‘మళ్ళీ మొదలైంది’లో హీరోయిన్ నైనా గంగూలీనీ టాలీవుడ్ కు తీసుకొచ్చింది రామ్ గోపాల్ వర్మే! సో వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా గురించి వర్మకు తెలియకుండా ఉండదు. సో… వీరంతా కలిసే… ఈ వ్యవహారం నడిపి ఉంటారనడంలో సందేహం లేదు. ఏదేమైనా… సుమంత్ గత చిత్రాలకు, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలకు రాని ఫ్రీ పబ్లిసిటీ ఈ శుభలేఖ, వర్మ ట్వీట్ తో ‘మళ్ళీ మొదలైంది’కి వచ్చేసింది.
ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ మధ్య విడుదలైంది. డైవర్స్, రీ మ్యారేజ్ అనే అంశంపై తెలుగులో వస్తున్న మొదటి సినిమా తమదే నంటూ సుమంత్ చెబుతున్నారు. విశేషం ఏమంటే… ఇది న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనేది విషయం ఆ పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. దీన్ని యంగ్ హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ‘ఏంటో ఏమో జీవితం… ఎందుకిలా చేస్తాదో జీవితం’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా… సాయిచరణ్ పాడాడు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు. సహజంగా ఇలాంటి రిలికల్ వీడియోస్ రెగ్యులర్ గా ఒకే పేట్రన్ లో ఉంటాయి. కానీ వాటికి కాస్తంత భిన్నంగా దీన్ని సినిమా షూటింగ్ ప్రారంభం నుండి మేకింగ్ కు సంబంధించిన సీన్స్ తో నడిపారు. దాంతో ప్రధాన తారాగణంతో పాటు టెక్నీషియన్స్ కూ ఈ వీడియోలో చోటుదక్కింది. హీరోహీరోయిన్లు సుమంత్, నైనా గంగూలీతో పాటు పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు ఇందులో ఉన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో చక్కటి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమౌతోంది. విశేషం ఏమంటే… ఈ మూవీ ప్రమోషన్ ను కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారన్నది ఇన్ స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతున్న మీమ్స్ చూస్తే అర్థమౌతోంది. ఈ సినిమాను కీర్తి కుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ‘మళ్ళీ రావా’ తర్వాత మరోసారి ‘మళ్ళీ మొదలైంది’తో సుమంత్ హిట్ కొట్టేట్టే కనిపిస్తున్నాడు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!


Here comes the quirky heartbreak song of “Malli Modalaindi”. @laharimusic@iSumanth@tej_Uppalapati@NainaGtweets@tgkeerthikumar @anuprubens #KRajashekarReddy #RedCinemas #krishnachaitanyahttps://t.co/5J9b9KN3iN pic.twitter.com/OVSqlL8s6G
— nithiin (@actor_nithiin) August 21, 2021
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!