మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22)ను పురస్కరించుకుని, శనివారం గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల రూపొందించనున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శ్రీదేవి శోభన్‌బాబు
అనే పేరుతో రూపొందనున్న ఈ క్యూట్ లవ్‌స్టోరిలో యువ కథానాయకుడు సంతోష్ శోభన్, ‘జాను’ ఫేమ్ గౌరి జి. కిషన్ జంటగా నటిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ పేరుతో ఓ వెబ్ సీరిస్ ను నిర్మించింది. ఇప్పుడీ సినిమాతో చిత్ర నిర్మాణంలోకీ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఓ వీడియో ప్రోమోను సంస్థ విడుదల చేసింది. కలర్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందనున్న శ్రీదేవి శోభన్‌బాబు
లో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.