మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు. […]
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా కథలు ఎలా సాగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సున్నితమైన భావోద్వేగాలే ఆయన సినిమాలకు బలం. ఎంత నెమ్మదిగా చెప్పితే అంతా గట్టిగా హృదయాల్లో నిలుస్తాయనడానికి ఆయన సినిమాలే ఉదాహరణలు. అయితే కొన్నిసార్లు ఆ నిడివే సినిమాకు బలహీనతగా కూడా మారుతోంది. నిజానికి శేఖర్ కమ్ముల తన కథకు తగ్గట్టుగా సన్నివేశం ఎంత సమయం తీసుకోవాలనే దానిలో పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తారు. అయితే కాలక్రమములో, ఈ ఇంటర్ నెట్ ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచి […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం నుండి ధియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తూ శనివారం జీవోను జారీ చేసింది. అయితే ఏపీలో మాదిరిగా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. దాంతో రోజుకు కేవలం మూడు ఆటలతో సరిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాడుకు చెందిన సినిమా జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చాలా రంగాలకు కరోనా నిబంధనల నుండి […]
”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు. ఈ […]
అనుకున్నట్టే అయ్యింది… మరో పాన్ ఇండియా మూవీ విడుదల వచ్చే యేడాదికి వాయిదా పడింది. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఈ దసరాకు కాకుండా… వచ్చే యేడాది జనవరి 26న విడుదల కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కన్నడ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ -2’ మూవీని వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ తెలిపింది. ఈ విషయాన్ని హీరో యశ్ సైతం ధ్రువీకరించాడు. కన్నడ సంవత్సరాది […]
(ఆగస్టు 22న ‘చంటబ్బాయ్’ 35 ఏళ్ళు పూర్తి) మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆయన పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదలైన ఏకైక చిత్రం ‘చంటబ్బాయ్’. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఒకే ఒక్క చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘చంటబ్బాయ్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం హాస్యంతో సాగే ఈ సినిమాలో చివరలో […]
ఏపీలోని వివిధ జిల్లాల వ్యాప్తంగా 23 చోరీ కేసులు చేసిన గజదొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెదగొన్నూరులో నిందితుడు గుబిలి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుడు ప్రధానంగా సీసీ కెమెరాలు, వైఫై రౌటర్లు, డీవీఆర్ లు చోరీ చేసేవాడని తెలిపారు. అంతేకాదు చోరీల్లో సుబ్రహ్మణ్యం చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. ఖద్దరు చొక్కా, తెల్ల పంచె ధరించి దొంగతనాలకు వెళ్లేవాడని వివరించారు.సీసీ కెమెరాల దొంగతనం బోర్ కొట్టిందో లేక పెద్ద దొంగతనంతో సెట్ అయ్యిపోవాలి […]
అఫ్ఘానిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇదిలావుంటే, అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తెలిపారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని, అది అనవసరం కూడా అని ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన […]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, ఉగాది పండుగలను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనం పండగను జరుపుకుంటారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం పండగ ఒకటి.. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు.ఈ పండగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు […]