బ్రేవ్ హార్ట్ పిక్చర్స్ పతాకంపై బాబా పి. ఆర్. దర్శకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘సైదులు’. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ… ”టైటిల్ చాలా క్యాచీగా ఉంది. సినిమాకాన్సెప్ట్ కూడా విన్నాను. ఎంతో ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. చిత్ర దర్శకుడు […]
‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని, మరీ ముఖ్యంగా ఆ సినిమాను ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే స్ట్రీమింగ్ చేయించాలని అనుకోవడాన్ని శుక్రవారం తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ తప్పు పట్టింది. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పలువురు థియేటర్ ఓనర్స్ ‘టక్ జగదీశ్’ హీరో నానిపై వ్యక్తిగత విమర్శలూ చేశారు. అయితే…. శనివారం ఆ విషయమై తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ క్షమాపణలు కోరింది. ఎవరినీ వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ విమర్శించడం తమ అభిమతం […]
మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. కాగా ఇప్పటికే, లోకల్-నాన్ లోకల్, మా నిధులు, మా శాశ్వత భవనం అంటూ ఒకరిపై ఒకరు పోటీదారులు ఆరోపణలు చేసుకోవడంతో వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ట్విటర్ ద్వారా వీడియో సందేశం ఇస్తూ.. త్వరలోనే ‘మా’ శాశ్వత భవనం కల నెరవేరనుందని చెప్పుకొచ్చారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించామని విష్ణు తెలిపారు. […]
(ఆగస్టు 21న భూమిక బర్త్ డే) చూడగానే తెలిసినమ్మాయి అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా బిజీగానే సాగుతున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా, దక్షిణాది వాసనలనే ఇష్టపడింది భూమిక. అందుకే తెలుగు, తమిళ చిత్రాలలో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక. నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం ‘యువకుడు’ ద్వారా భూమిక చావ్లా సినిమా […]
(ఆగస్టు 21న నటి రాధిక పుట్టినరోజు) చిలిపితనం, చలాకీతనం కలబోసిన రూపంతో రాధిక అనేక చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. ఇప్పుడంటే అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు కానీ, ఒకప్పుడు రాధిక అందం, అభినయం జనాన్ని కట్టిపడేశాయి. ఇక డాన్సుల్లోనూ ఆమె స్పీడును చూసి జనం అబ్బో అన్నారు. కొందరు ఆమె సరసన చిందులు వేయడం చేతకాక బొబ్బలు పెట్టారు. ‘న్యాయం కావాలి’ చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన రాధిక నాయికగా పలు చిత్రాలతో జైత్రయాత్ర చూశారు. […]
(ఆగస్టు 21న పి.ఆదినారాయణరావు జయంతి) సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావు తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు. స్వరకల్పనలో వినసొంపైన రాగాలు కూర్చి జనం మదిని దోచారు. అభిరుచిగల నిర్మాతగా అనేక మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆదినారాయణరావు నిర్మాత కాకపోయివుంటే మరింత మధురం తెలుగువారి సొంతం అయ్యేదని ఎందరో సంగీతప్రియులు అంటూ ఉంటారు. మాటలతోనే ఆరంభించి, పాటకు రాగం సమకూర్చడంలోనూ, పాటల్లోని పదాలను వీనులకు విందు చేసేలా విరచి, తన స్వరవిన్యాసాలతో అమృతం అద్దడంలోనూ ఆదినారాయణ […]
(ఆగస్టు 20న పద్మనాభం జయంతి) తెలుగు సినిమా నవ్వుల తోటలో పద్మనాభం ఓ ప్రత్యేకమైన పువ్వు. నవ్వు నాలుగందాల చేటు అంటారు కానీ, పద్మనాభం నవ్వును నాలుగు వందల విధాలా గ్రేటు అనిపించారు. ఆయన నటించిన వందలాది చిత్రాలను పరిశీలిస్తే, ఒక్కో సినిమాలో ఒక్కోలా నవ్వుతూ అలరించారు. ఆయన నవ్వులను అనుకరిస్తూ ఆ రోజుల్లో కుర్రకారు తమ చుట్టూ ఉన్నవారికి కితకితలు పెట్టేవారు. కేవలం హాస్యనటునిగానే కాదు, నిర్మాతగా, దర్శకునిగానూ పద్మనాభం సాగారు. ఆయన సొంత నిర్మాణ […]
అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ ఈ కథను అందించారు. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ‘అలసిన సంచారి’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. […]
కథ, కథనం బాగుంటే తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్స్ కి ఏమి ఢోకా లేదని ఇప్పటికే చాలా సినిమాలు రుజువుచేశాయి. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్ల పట్ల అభిమానుల్లో ఆసక్తి వున్నా సరైన సినిమా రాలేదనిది ఓ వర్గ అభిమానుల ఆవేదన.. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో ఒకటి, రెండు మాత్రమే ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాలు ఏవి రాకపోవడంతో కాస్త నిరాశగానే […]