సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ (79) నాగపూర్ లో గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. హిందీ, మరాఠీ, భోజ్ పురిలో వందకు పైగా చిత్రాలకు రామ్ లక్ష్మణ్ సంగీతాన్ని అందించారు. రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. దాదా కోండ్కే కెరీర్ ప్రారంభంలో విజయ్ తో మరాఠీ చిత్రాలకు, ఆ పైన హిందీ చిత్రాలకు స్వరాలు సమకూర్చే అవకాశం కల్పించారు. తన స్నేహితుడు సురేంద్రతో కలిసి విజయ్ ‘రామ్ లక్ష్మణ్’ పేరుతో చిత్రసీమలో సంగీతాన్ని కొన్నేళ్ళు […]
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 61వ పుట్టిన రోజును జరుపుకున్నారు. నిజానికి అందులో పెద్ద విశేషం లేదు. కానీ ఈ యేడాది ఆయన పుట్టిన రోజును గతంలో కంటే కూడా భిన్నంగా ఓ గొప్ప మానవతామూర్తిగా జరుపుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అందులో కేరళ కూడా మినహాయింపేమీ కాదు. అయితే మల్లూవుడ్ కు చెందిన ఈ మెగాస్టార్ తన పుట్టిన రోజు సందర్భంగా తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా కేరళలోని వివిధ ప్రాంతాలలో […]
‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి వారూ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తర్వాత యశ్ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మూవీ దాదాపు పూర్తయిపోయింది. కృష్ణంరాజుకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొద్దిగా ప్యాచ్ వర్క్. ఒకే ఒక్క పాట చిత్రీకరించాల్సి ఉంది. కానీ ప్రభాస్ వ్యక్తిగత సిబ్బందికి కారోనా రావడంతో పాటు పూజాహెగ్డే సైతం కొవిడ్ 19 బారిన పడింది. దాంతో అర్థాంతరంగా షూటింగ్ ను ఆపేశారు. గతంలో కొన్ని సినిమాల విషయంలో జరిగినట్టే… ఇప్పుడు కూడా ప్రభాస్, పూజా హెగ్డే మీద ఉన్న బాలెన్స్ పాటను […]
కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో పరిస్థితులు క్లిష్టతరమైపోయాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటే పద్ధతులతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రజలకు కరోనాపై అవగాహన కలిగించేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ పై పలు అపోహలు ఉండగా… వాటిని తొలగించేందుకు పలువురు సెలబ్రిటీలు వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ హెగ్డే పై రేప్ కేసు నమోదైంది. ముంబైలోని డిఎన్ నగర్ లో కుమార్ పై రేప్, అన్ నాచురల్ సెక్స్, చీటింగ్ కేసులు నమోదు చేసింది ఓ మహిళ. మే 19న కేసు నమోదు చేసిన ఆ మహిళ కుమార్ హెగ్డే తనను మోసం చేశాడని, చాలాసార్లు లైంగికంగా వేధించాడని, అంతేకాకుండా తన దగ్గర 50 వేల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. ఎఫ్ఐఆర్ ప్రకారం… గత సంవత్సరం […]
కొన్ని కాంబినేషన్స్ జనాన్ని భలేగా అలరించి, విజయాలనూ సొంతం చేసుకుంటాయి. కానీ, ఎందుకనో రిపీట్ కావు. అదే విచిత్రంగా ఉంటుంది. చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలు సాధారణమే అనుకోవాలి. హీరో వెంకటేశ్ తో దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ అలాంటి చిత్రమైన పరిస్థితినే చూశారు. నిజానికి వెంకటేశ్ కుటుంబ సభ్యులద్వారానే ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకునిగా మారారు. అయితే వెంకటేశ్ సొంత సంస్థ అయిన సురేశ్ ప్రొడక్షన్స్ లో ఆయనను డైరెక్ట్ చేయలేకపోయానని ఇ.వి.వి. సత్యనారాయణ అంటూ ఉండేవారు. వెంకటేశ్, ఇ.వి.వి. […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నయా మూవీ రాధేని చూసి సగటు సినిమా ప్రేక్షకుడు సైతం పెదవి విరుస్తున్నా… ఆ మూవీ ఎలా ఉందో ఓసారి చూసేస్తే పోలా అనే భావనే అత్యధికశాతం మంది సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇటు విదేశాలలో థియేటర్లలోనూ, పలు దేశాల్లో పే ఫర్ వ్యూ పద్ధతిలోనూ ఈ సినిమాను చూసే అవకాశం నిర్మాతలు కల్పించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే… ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో యాపిల్ టీవీ […]
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. తొలి సినిమాతోనే (జాతి రత్నాలు) అందరి మనసులు గెలుచుకుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌కి సంబంధించిన వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దవుతుండగా, రుతుపవనాల రాకతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానంటూ ఫరియా తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేసింది. తన డ్యాన్స్ వీడియో క్లిప్ లలో ‘ఆజా రీ మోర్ సైయన్’ […]
అనన్య నాగళ్ల వకీల్ సాబ్ మూవీతో వచ్చిన క్రేజ్‌ను బాగానే వాడుకుంటుంది. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో నటించిన రాని పేరు.. పవన్ సినిమాతో సాధ్యమైంది. కాగా ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే అనన్య ఒక్కసారిగా అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఇప్పటివరకు ఎక్స్‌ఫోజింగ్‌కు దూరంగా ఉన్న అనన్య తాజాగా తన నడుము అందాలను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. అనన్య నుంచి […]